
- 13 రోజుల కింద అడవిలో అదృశ్యమైన రిటైర్డ్ ఫారెస్ట్ వాచర్
అమ్రాబాద్, వెలుగు: నాగర్ కర్నూల్జిల్లా లింగాల మండలం నల్లమల అటవీ ప్రాంతంలో అటవీ ఉత్పత్తుల సేకరణకు గత నెల 26న వెళ్లి అదృశ్యమైన రిటైర్డ్ ఫారెస్ట్ వాచర్ తోకల మల్లయ్య(65) శవమై కనిపించాడు. శవం కుళ్లిపోవడంతో శుక్ర వారం ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. 13 రోజుల కింద తప్పిపో యిన మల్లయ్య ఎలుగుబంటి దాడిలో చని పోయాడని డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ రవికు మార్ తెలిపారు. ఎలుగుబంటి దాడి చేసిన గాయాలు శరీరంపై ఉన్నాయని చెప్పారు