
దేశంలోనే అత్యధిక కాలం పాటు ప్రభుత్వ పెన్షన్ అందుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించిన బోయత్‌రామ్ (100) కన్నుమూశారు. రాజస్థాన్‌కు చెందిన బోయత్‌రామ్ 1923లో జన్మించాడు. 17 ఏళ్ల వయసులో ఆయన ఆర్మీలో చేరాడు. బ్రిటిష్ ఆర్మీ తరపున రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న బోయత్‌రామ్... స్వాతంత్ర్యానంతరం భారత సైన్యంలో భాగమయ్యారు. 1957 లో ఆయన ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. అప్పటి నుంచి ప్రతినెల పెన్షన్ అందుకుంటున్నారు. ప్రారంభంలో రూ. 19గా ఉన్న పెన్షన్ .. ఆయన చనిపోయేనాటికి రూ. 35,460కు చేరింది. అలా ఆయన 1957 నుంచి 66 ఏళ్ల పాటు పెన్షన్ అందుకున్న ఏకైక సైనికుడిగా రికార్డు సృష్టించారు. యుద్ధంలో ధైర్యసాహసాలకు గాను బోయత్‌రామ్ కు 4 పతకాలు లభించాయి. బోయత్‌రామ్ భార్య చందా దేవి, ఇద్దరు కుమారులున్నారు. ఆర్మీ నిబంధనల ప్రకారం ఇప్పుడు బోయత్‌రామ్ భార్య చందా దేవికి సగం పెన్షన్ అందనుంది.