టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ పార్టీకే నష్టం

టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ పార్టీకే నష్టం
  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

 హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్  అధినేతకు అమ్ముడుపోయారని కమ్యూనిస్టులపై పీసీసీ  చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నోరుపారేసుకోవడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.  విధానాలే ప్రాతిపదికగా పనిచేస్తున్న కమ్యూనిస్టు పార్టీలపై చెత్తవాగుడు మానుకోవాలని ఆదివారం ఓ ప్రకటనలో ఆయన హెచ్చరించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీలు ముందుకు సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బీజేపీని ఓడించడాన్ని ప్రధాన లక్ష్యంగా ఎంచుకోకుండా టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌గా పెట్టుకోవడం కాంగ్రెస్‌ పార్టీకే నష్టమని ఆయన అన్నారు.