వైన్ షాపులకో న్యాయం.. చిన్న షాపులకో న్యాయమా?

వైన్ షాపులకో న్యాయం.. చిన్న షాపులకో న్యాయమా?

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే లిక్కర్ ఓపెన్ చేశారో.. అప్పుడే ప్రజల్లో కొరొనా భయం పోయిందన్నారు కాంగ్రెస్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి. వైన్ షాపుల ద‌గ్గ‌ర వంద‌ల‌ మంది గుంపులుగా ఉన్నప్పుడు రాని కరోనా.. ఒక్కరిద్దరు పొట్టకూటి కోసం పని చేసుకునే మెకానిక్ షాప్స్ ల ద్వారా వస్తుందా అని ప్ర‌శ్నించారు. వైన్ షాపులకో న్యాయం.. చిన్న షాపులకో న్యాయమా? అన్నారు. లాక్ డౌన్ లో వేల కోట్ల బిజినెస్ ను పోగొట్టుకొని వ్యాపారులు ప్రభుత్వానికి సహకరిస్తే .. వైన్స్ షాప్స్ తెరవడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చిందన్నారు. 45రోజుల వ్రతాన్ని ఒక్క రోజుతో కేసీఆర్ లిక్కర్ షాప్స్ తెరవడంతో ఆగమాగం అయిందని..ఎవరి ప్రాధాన్యత వాళ్లకు ఉంటుందన్నారు. ప్రభుత్వానికి లిక్కర్ ప్రాధాన్యత అయినప్పుడు.. చిరు వ్యాపారులకు కుటుంబాన్ని పోషించుకునేందుకు వాళ్లకు ప్రాధాన్యత ఉంటుంద‌న్నారు రేవంత్ రెడ్డి .

దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, అహ్మదాబాద్, ఏరియాల్లో ఎక్కువగా కేసులు పెరగడానికి కారణం నమస్తే ట్రంప్ మీటింగ్ అన్నారు. మర్కజ్ కి వెళ్ళింది 10వేల మంది మాత్రమేన‌ని.. కానీ నమస్తే ట్రంప్ మీటింగ్ కు లక్షల మంది అటెండ్ అయ్యారన్నారు. ప్రపంచ టూరిజమ్ ప్రాంతం అయిన గోవాలో కేసులు లేవు. కానీ గుజరాత్, మహారాష్ట్రలో కేసులు ఎక్కువ‌ని..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు అసెంబ్లీలో అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు అధికార పార్టీ తప్ప ఎవ్వరికి అవకాశం లేదని .. స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, ప్రతి పక్షాలతో మాట్లాడి గొంతును ప్రజలకు చేరవేసే వాళ్ళని.. ఇప్పుడు పరిస్థితి అంతా రివర్స్ అయిందని తెలిపారు రేవంత్ రెడ్డి.