సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితోనే పాదయాత్ర చేస్తున్నా: రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితోనే పాదయాత్ర చేస్తున్నా: రేవంత్ రెడ్డి

మేడారం అభివృద్దిని కేసీఆర్ విస్మరించారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వస్తే మేడారం అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మేడారం సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితోనే పాదయాత్ర చేస్తున్నానని..  కాంగ్రెస్ ముఖ్యులంతా యాత్రలో పాల్గొంటారని చెప్పారు. భారత్ జోడో యాత్ర ఎన్నికల కోసం చేసింది కాదని.. అది ఒక ఉద్యమం అన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సీతక్క పై రేవంత్ ప్రశంసలు కురిపించారు. సీతక్కతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ముందుగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తానని రేవంత్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. 

బడ్జెట్ లెక్కలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని రేవంత్ అన్నారు. బడ్జెట్‭కు విలువ లేదని కొట్టిపారేశారు. ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో మాట్లాడే పరిస్థితి లేదన్న ఆయన.. అసహనంలో ఉన్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. తొమ్మిదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం 25 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే.. 119 నియోజకవర్గాల్లో ఎంత ఖర్చు చేశారు..? ఎంత దొంగల మయం ఎంత అయ్యిందని ప్రశ్నించారు. కేసీఆర్ డబ్బులను నమ్ముకుంటే.. తాము ప్రజలను నమ్ముకున్నామని చెప్పారు. పార్టీ నేతలందరిని కలుపుకొని యాత్ర కొనసాగిస్తామని రేవంత్ వెల్లడించారు.