కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

కేసీఆర్కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
  • 4 లక్షల మంది నష్టపోయే పరిస్థితి ఉంది
  • టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ కు  టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంచాలని లేఖలో డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఇటీవల వేసిన ఉద్యోగాల భర్తీలో 17 వేల పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వేశారని, అందులో కానిస్టేబుల్ పోస్ట్ లు అధికంగా ఉన్నాయి కానీ వయో పరిమితి సడలింపు కేవలం మూడేళ్లు మాత్రమే చేసారని లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల 4 లక్షల మంది దరఖాస్తు దారులు నష్టపోయే పరిస్థితి ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో యువత  పోరాటం చేశారని, కాబట్టి వారికి 5 ఏళ్ల పాటు వయో పరిమితి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఇక్కడ ఉద్యోగాల కోసం అంత ఇబ్బందులు పడుతుంటే హోంమంత్రి ఉన్నాడో.. లేడో తెలియదు.. మీరేమో ఫామ్ హౌస్ లో సేద తీరుతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగార్థులు కోరుతున్న విధంగా వయో పరిమితి పెంచాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్ష కార్యాచరణ కు దిగుతుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

 

 

ఇవి కూడా చదవండి

నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న హైపర్ టెన్షన్

మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల‌కు శుభవార్త

విజయ్ దేవరకొండపై పీకే ఫ్యాన్స్ ఆగ్రహం