మేడారం జాతరను ప్రభుత్వాలు గుర్తించట్లే

మేడారం జాతరను ప్రభుత్వాలు గుర్తించట్లే

రాజుల మీద పోరాడి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన సమ్మక్క సారలమ్మ జాతరవైపు సీఎం కేసీఆర్ కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం దారుణమని అన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం లేదని విమర్శించారు. ఇవాళ( శనివారం) మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకున్న రేవంత్ రెడ్డి.. మొక్కులు చెల్లించుకున్నారు.  ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. 

రియలెస్టేట్ వ్యాపారి రామేశ్వరరావు నిర్మించిన కృత్రిమ కట్టడాలు  దగ్గరకు ప్రధాని, సీఎం  వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్. సమ్మక్క సారలమ్మలను అవమానించే అధికారం  వీరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. రూ. 200 కోట్లతో శాశ్వత పర్యాటక కేంద్రంగా మేడారంను అభివృద్ధి చేయాలన్నారు. ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలని.. కుంభమేళా మాదిరే మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తల కోసం..

పంజాబ్ సీఎం చన్నీపై కేసు నమోదు