గవర్నర్ అధికారాలను వెంటనే ఉపయోగించుకోవాలె

గవర్నర్ అధికారాలను వెంటనే ఉపయోగించుకోవాలె

గవర్నర్ తనకున్న అధికారాలను వెంటనే ఉపయోగించుకోవాలన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన గవర్నర్-రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూపై మాట్లాడారు. విద్య, వైద్యం, శాంతిభద్రతలపై గవర్నర్ వెంటనే సమీక్ష చేయాలన్నారు. సమస్యలన పరిష్కరించే అధికారం సెక్షన్ 8ప్రకారం గవర్నర్ కు ఉందన్నారు. విభజన చట్టం ప్రకారం దేశంలో ఏ గవర్నర్ కు లేని అధికారులు.. మన గవర్నర్ కు ఉన్నాయాన్నారు. యూనివర్శిటీల్లో ఖాళీలు ఉన్నాయని గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇచ్చారన్నారు. గవర్నర్ కోటాలో కేసీఆర్ నియమించినవాళ్లంతా రాజకీయ నాయకులే అన్నారు రేవంత్. గవర్నర్ బీజేపీకి ఎజెంట్ గా ఎలా పనిచేస్తున్నారో.. టీఆర్ఎస్ నేతలు చెబితే బాగుండేదన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే గవర్నర్ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆస్పత్రుల్లో కుక్కలు, పిల్లులు, ఎలుకలు పెత్తనం చేస్తున్నాయన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారంటే.. రాష్ట్రంలో వైద్యం పడకేసినట్లే అన్నారు రేవంత్.  

41 ఏండ్లలో 60 కేసులు పెట్టుకున్న భార్యాభర్తలు

నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఇబ్బంది కాలేదు