కేసీఆర్ నౌకరివ్వక పిల్లగాని పెళ్లికాకపాయే..

కేసీఆర్ నౌకరివ్వక పిల్లగాని పెళ్లికాకపాయే..

కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్ దగ్గర వందల కోట్ల రూపాయలు లేవు..వేల ఎకరాల భూమి లేదన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. వాళ్ల తాతలు,ముత్తాతలు ముఖ్యమంత్రులుగా,మంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా లేదన్నారు. పేదల కోసం  మూడుసార్లు జైలుకుపోయి పోలీసుల చేతుల్లో పక్కటెముకలు విరగ్గొట్టుకుని పోరాటం చేశారన్నారు. హుజురాబాద్ లో బీజేపీ తరపున నిలబడ్డ ఈటల..మొన్నటి వరకు కేసీఆర్ వెంట కార్ల తిరిగి కత్తితో ప్రజలను పొడిచిండన్నారు. అమరవీరుల త్యాగాల గురించి ఈటల ఏనాడు మాట్లాడలేదన్నారు. 1200 మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. కేసీఆర్, ఈటల ఆధిపత్యపోరుతోనే హుజురాబాద్ బైపోల్ అని అన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదన్నారు.

టీఆర్ఎస్, బీజేపీ పోటీపడి ఓట్లు కొనుగోలు చేస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ అబద్ధాలకు అదుపులేకుండా పోయిందన్నారు. సన్నాలు వేసిన రైతులకే కేసీఆర్ సున్నం పెట్టారన్నారు. హరీశ్, ఈటల తోడుదొంగలన్నారు. హరీశ్, ఈటల ఒకే కంచంలో తిని..ఒకే మంచంపై పడుకుని.. ఇపుడు యుద్ధానికి కత్తులు తీసుకుని బయల్దేరారన్నారు. కేసీఆర్ పెద్దకొడుకు కాదు దొంగ కొడుకని అన్నారు. కేసీఆర్  నౌకరివ్వక పిల్లగాని పెళ్లికాకపాయే..బిడ్డ లగ్గం కాకాపాయేనన్నారు.టీఆర్ఎస్, బీజేపీ కలిసి హుజురాబాద్ లో 240 కోట్లు పంచిపెట్టారన్నారు.