కొడంగల్  నియోజకవర్గంలో రేవంత్  గెలుపు ఖాయమైంది: తిరుపతి రెడ్డి

కొడంగల్  నియోజకవర్గంలో రేవంత్  గెలుపు ఖాయమైంది: తిరుపతి రెడ్డి

మద్దూరు, వెలుగు: కొడంగల్  నియోజకవర్గంలో ఈసారి రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమైందని, అందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కొత్తపల్లి మండల కేంద్రం, నిడ్జింత గ్రామాల్లో పార్టీ ఆఫీసులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ప్రతి ఒక్కరికి తెలిసేలా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. అప్పుడే మెజార్టీ భారీగా పెరుగుతుందన్నారు. జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, లీడర్లు సంజీవ్, చెన్నప్ప, మహీందర్, శ్రీనివాస రెడ్డి, విజయ్ కుమార్, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.