రెవెన్యూ లోటు భర్తీ: 17 రాష్ట్రాలకు కేంద్రం నిధులు

రెవెన్యూ లోటు భర్తీ: 17 రాష్ట్రాలకు కేంద్రం నిధులు

రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలకు రూ. 9,871 కోట్ల గ్రాంట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. రెవెన్యూ లోటు నిధుల పదో ఇన్‌స్టాల్‌మెంట్‌ను గురువారం విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.98,710 కోట్లను ఆయా రాష్ట్రాలకు రిలీజ్ చేసింది కేంద్రం. ఆర్టికల్ 275 కింద రెవెన్యూ లోటు భర్తీ కోసం ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. 

 ఈ ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కోసం లక్షా 18 వేల 452 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని 15వ  ఫైనాన్స్ కమిషన్ కేంద్రానికి సూచించింది. ఈ సిఫార్సుల మేరకు కేంద్రం నెల వారీగా ఇన్‌స్టాల్‌మెంట్లు ఇస్తోంది.  ఇప్పటి వరకు 83.33 శాతం నిధులను కేంద్రం ఇవ్వగా.. మరో రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో పూర్తి నిధుల్ని మార్చిలోపు ఇస్తుంది. 

రాష్ట్రాల వారీగా ఇచ్చిన నిధులు

 

రాష్ట్రం                     ఫండ్స్ (రూ. కోట్లలో)

ఆంధ్రప్రదేశ్‌                1,438.08

కేరళ                               1,657.58

వెస్ట్ బెంగాల్                 1,467.25

హిమాచల్‌ప్రదేశ్           854.08

పంజాబ్‌                         840.08

రాజస్థాన్‌                         823.17

ఉత్తరాఖండ్                  647.67

అస్సాం                          531.33

నాగాలాండ్‌                   379.75

త్రిపుర                           373.83

మణిపూర్‌‌                     210.33

తమిళనాడు                183.67

మిజోరం                       149.17

కర్ణాటక                         135.92

మేఘాలయ                 106.58

సిక్కిం                           56.5

హర్యానా                       11