మార్కెట్లోకి విడుదలైన రివోల్ట్ స్మార్ట్ బైక్

మార్కెట్లోకి విడుదలైన రివోల్ట్ స్మార్ట్ బైక్

రివోల్ట్ మోటార్స్ కంపెనీ RV400 పేరిట దేశంలో ఫస్ట్ టైం ఫుల్లీ ఎలక్ట్రిక్ A1ఎనేబుల్డ్ మోటార్ సైకిల్ ను అఫీషియల్ గా విడుదల చేశారు. RV300, RV 400 వేరియంట్లలో లభించే ఈ 2 బైకులను అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. గూగుల్ వాయిస్ కమాండ్, GPSతో పాటు మరిన్ని సౌకర్యాలు ఈ బ్రేక్ లో ఉన్నాయి. ఎలాంటి డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన పనిలేకుండా నిర్దిష్ట కాలపరిమితితో(37 నెలలకు) బైక్స్ ను లీజుకు తీసుకోవచ్చని తెలిపింది సంస్థ.

లీజు వివరాలు ఇలా ఉన్నాయి..

RV 300 బైకును 37 నెలల కాలానికి గాను నెలకు రూ.2,999 ధరకు లీజుకు ఇస్తున్నారు. దాంతో ఈ బైక్ ధర రూ.1.10 లక్షలు అవుతుంది.

RV400 బేస్ వెర్షన్‌ ను నెలకు రూ.3499 కు 37 నెలల కాల వ్యవధితో లీజుకు ఇస్తున్నారు. ఈ వేరియెంట్ ధర రూ.1.29 లక్షలు అవుతుంది.

RV400 ప్రీమియం మోడల్ 37 నెలల కాలవ్యవధితో నెలకు రూ.3,999 చెల్లింపుతో మొత్తం రూ.1.47 లక్షల ధరకు వినియోగదారులకు లభిస్తుంది.

ఈ మొత్తంలో ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, 3 ఏళ్ల సర్వీస్, అన్‌లిమిటెడ్ బ్యాటరీ వారంటీలు కలిసే ఉంటాయి. ఈ బైక్‌ ను వినియోగదారులకు సెప్టెంబర్ చివరి నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపింది సంస్థ.