గోదావరిఖని, వెలుగు: మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు ఇతర మావోయిస్టుల ఎన్కౌంటర్‌పై న్యాయవిచారణ జరిపించాలని విప్లవ పార్టీలు, కార్మిక సంఘాల లీడర్లు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో గత నెల 28న ఆంధ్రప్రదేశ్లోని ఓ షెల్టర్లో ఉన్న హిడ్మా, అతని సహచరులను ఆంధ్ర పోలీసులు పట్టుకుని అల్లూరి సీతారామారాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లోకి తీసుకుని నిరాయుధులను చేసి కిరాతకంగా కాల్చి చంపారని ఆరోపించారు.
దేశంలో ఖనిజ సంపద కోసం ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు రక్తపుటేరులు పారిస్తున్నారన్నారు. అడవుల నుంచి ఆదివాసులను వెళ్లగొట్టేందుకు బూటకపు కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్జడ్జితో న్యాయ విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో లీడర్లు కె.రాజన్న, ఐ.కృష్ణ, ఇ.నరేశ్, బి.అశోక్, కట్టా విశ్వనాథ్, జూపాక శ్రీనివాస్, రమేశ్ ఉన్నారు.
