VYOOHAM Teaser 2 : పవన్ కల్యాణ్ పై.. చంద్రబాబు ఆలోచన ఇదేనా..!

VYOOHAM Teaser 2 : పవన్ కల్యాణ్ పై.. చంద్రబాబు ఆలోచన ఇదేనా..!

వ్యూహం సినిమా టీజర్ 2 ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ఊహించని ట్విస్టులు ఇచ్చారు వర్మ. తెలంగాణ అంశంతోపాటు పవన్ కల్యాణ్​పాత్రను హైలెట్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. టీజర్ అయితే జగన్ ఎంత సేపు కనిపిస్తారో.. పవన్ కల్యాణ్ అంతేసేపు కనిపిస్తూ ఉండటంతో.. వ్యూహం సినిమాలో అతని క్యారెక్టర్ పై ఆసక్తి పెరుగుతుంది. 

డైలాగ్స్ చాలా తక్కువగా ఉన్నా.. ఉన్న నాలుగు డైలాగ్స్ మూవీపై ఆసక్తిని పెంచుతున్నాయి. టీజర్ చివర్లో చంద్రబాబు వ్యక్తిత్వత్వాన్ని చూపిస్తూ.. పవన్ కల్యాణ్ విషయంలో చంద్రబాబు వైఖరి ఎలా ఉంటుంది.. బాబు మనసులో పవన్ క్యారెక్టర్ ఎలాంటిది అనేది డైలాగ్ రూపంలో చూపించారు రాంగోపాల్ వర్మ. 

ఎప్పుడో ఒకప్పుడు కల్యాణ్​ ను కూడా మీరు వెన్నుపోటు పొడుస్తారుగా అంటూ ఓ వ్యక్తి.. చంద్రబాబును ప్రశ్నించగా.. వాడికి అంత సీన్ లేదు.. తనను తానే పొడుచుకుంటాడు అంటూ చంద్రబాబు అన్న డెలాగ్ ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తి రేపుతోంది. 

చంద్రబాబు – పవన్ కల్యాణ్ క్యారెక్టర్లు వ్యూహం మూవీలో ఎలా ఉన్నాయో.. టీజర్ లో చూసేయండీ..