VYOOHAM Teaser 2 : జగన్ సినిమాలో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన

VYOOHAM Teaser 2 : జగన్ సినిమాలో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన

సీఎం జగన్ రాజకీయ జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వ్యూహం మూవీ సెకండ్ టీజర్ రిలీజ్ అయ్యింది. డైలాగ్స్ తక్కువ.. యాక్షన్ ఎక్కువ అన్నట్లు.. అన్ని అంశాలను టచ్ చేశారు వర్మ. జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిణామాలను సైతం టచ్ చేశారు వర్మ. 

ఒకే ఒక్క డైలాగ్ సినిమాలో తెలంగాణ అంశాన్ని హైలెట్ చేస్తుంది. రాష్ట్ర విభజనా.. బైఫరకేషనా అని జగన్ ఆశ్చర్యంగా అనటం.. తెలంగాణపై ఒకే ఒక్క డైలాగ్ గా ఉంది టీజర్ లో. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ కొత్తగా తెరపైకి తీసుకొచ్చినట్లు సీన్స్ చూస్తే స్పష్టం అవుతుంది. జగన్ డైలాగ్ తర్వాత.. సోనియాగాంధీ పాత్రను సైతం చూపించారు. డైలాగ్ లేకపోయినా.. చపాతీని రెండు ముక్కలు చేస్తున్నట్లు సీన్ క్రియేట్ చేశారు వర్మ. అంటే రాష్ట్ర విభజన ఖాయంగా నిర్ణయం తీసుకన్నట్లు.. అది జగన్ కు ఇష్టం లేదన్నట్లు సీన్స్ చూస్తే తెలుస్తుంది. 

వ్యూహం మూవీపై ఇప్పటి వరకు ఒక యాంగిల్ లోనే ఆచించారు ప్రేక్షకులు. కేవలం జగన్ అంశాన్ని మాత్రమే టచ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చినా.. టీజర్ చూసిన తర్వాత.. తెలంగాణ అంశం కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏపీలో మాత్రమే హీట్ పుట్టిస్తున్న వ్యూహం మూవీ.. ఇప్పుడు తెలంగాణలోనూ ఇంట్రస్టింగ్ అయ్యింది. అయితే తెలంగాణ అంశం పరిధి ఎంత వరకు ఉంటుంది అనేది వెయిట్ అండ్ సీ.. దీన్ని తెలంగాణ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మూవీ రిలీజ్ వరకు ఆగాల్సిందే.. 

వ్యూహం టీజర్ పై ఓ లుక్కేయండీ మీరూ..