ఇక్కడున్న పక్క రాష్ట్రాల వారికీ బియ్యం, నగదు

ఇక్కడున్న పక్క రాష్ట్రాల వారికీ బియ్యం, నగదు

రాష్ట్రంలో వలస కూలీలు 3,35,669 మంది
రాపిడ్ సర్వేలో గుర్తించిన అధికారులు
ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వలస కూలీలు 3,35,669 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం , రూ. 500 ఇచ్చేందుకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత చాలా మంది వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళ్లారు. ఇక్కడే ఉన్న చాలా మంది నిత్యావసరాలు, భోజనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరందరినీ ఆదుకుంటామని ఆదివారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎంతమంది వలస కూలీలు ఉన్నారన్నది రెండు రోజుల్లో అధికారులు ర్యాపిడ్ సర్వే ద్వారా తేల్చారు. అత్యధికంగా
రంగారెడ్డి జిల్లాలో 37,894 మంది, హైదరాబాద్ జిల్లాలో 34,283 మంది వలస కూలీలు ఉండగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 3,35,669 లెక్క తీశారు. బియ్యంకోసం రూ.13.18 కోట్లు, నగదు సాయానికి రూ.16.78 కోట్లు కలిపి మొత్తం రూ.29.96 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. పంపిణీ బాధ్యతను ఆయా జిల్లాల కలెకర్టకు అప్పగించింది. కార్మికులకు బ్యాంక్అకౌంట్ లేనట్లయితే కలెకర్ ఏర్పాటు చేసిన బృందాలు వారికి నగదు అందజేస్తాయి.

సీఎంకు అభినందనలు
వలస కూలీలను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన… వారికి బియ్యం, నగదు ఇచ్చేందుకు డబ్బులు విడుదల చేయటంపై దేశ వ్యాప్తంగా అభినందనలు వెలువెత్తాయి. కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, డాక్టర్ సంజీవ్ బాల్యన్లు సీఎం కేసీఆర్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు.

For More News..

రేషన్ మిల్లర్లకు వేధింపులుండవ్

మూడు రోజుల్లోనే 6 లక్షలు దాటిన కరోనా కాల్స్

కరోనా విరాళాలను వదలని సైబర్ దొంగలు

‘వర్క్ ఫ్రం హోం’ పై మైక్రోసాఫ్ట్ సూచనలు