నిద్రించే హక్కును ఉల్లంఘించలేం..బాంబే హైకోర్ట్

నిద్రించే హక్కును ఉల్లంఘించలేం..బాంబే హైకోర్ట్
  • నిద్రించే హక్కును ఉల్లంఘించలేం
  • వృద్ధుడిని రాత్రంతా ఈడీ ప్రశ్నించడంపై కోర్టు సీరియస్

ముంబై: మనీ లాండరింగ్  కేసులో విచారణ పేరుతో సీనియర్  సిటిజన్ ను ఈడీ అధికారులు రాత్రంతా ప్రశ్నిచండంపై బాంబే హైకోర్టు సీరియస్  అయింది. నిద్రించడం కనీస అవసరమని, ఒక వ్యక్తి నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని పేర్కొంది. నిందితుడికి అనుకూలమైన టైమ్ లోనే ప్రశ్నించాలనిజస్టిస్  రేవతి మోహితె, మంజూషా దేశ్ పాండేతో కూడిన బెంచ్  స్పష్టం చేసింది. 

మనీ లాండరింగ్  కేసులో ఈడీ అధికారులు తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ రామ్  ఇస్రానీ (64) వేసిన పిటిషన్ పై  బెంచ్  ఈ ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇస్రానీ వేసిన పిటిషన్ ను బెంచ్  కొట్టేసింది. కానీ, ఆయనను అధికారులు విచారణ చేసిన తీరుపై  మండిపడింది.