
కార్టూన్ నెట్‌వర్క్.. ఈ ఛానెల్ పేరంటూ తెలియని వారుండరు. స్మార్ట్ టీవీలు, యూట్యూబ్ వంటి వినోదాత్మక వీడియో చానెళ్లు లేని కాలంలో పిల్లలు, పెద్దలను అలరించే ఏకైక ఛానెల్ ఇది. ఇంకా చెప్పాలంటే.. 80, 90లలోని పిల్లలకు ఇష్టమైన టీవీ ఛానెల్ ఇది. టామ్ అండ్ జెర్రీ, పోపాయ్, పవర్ ఫఫ్ గర్ల్స్, కరేజ్ ది కోవర్డ్లీ డాగ్, బెన్ 10.. అబ్బో ఇటువంటి ఎన్నెన్నో వింటేజ్ షోస్ మరవని జ్ఞాపకాలు. అటువంటి ఛానెల్ ఇప్పుడు సడెన్‌గా మూతపడనుందంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.
కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ నిజంగానే మూతపడనుందా ? #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ కావడానికి కారణాలేంటి..? వస్తున్న వార్తలో నిజమెంత? అనేది తెలుసుకుందాం!
ALSO READ | ఇంజనీరింగ్ అద్భుతం: రోడ్డు, మెట్రో ట్రాక్.. టూ ఇన్ వన్ ఫ్లైఓవర్..
నిజానికి కార్టూన్ నెట్‌వర్క్ ఛానెల్ మూతపడనుంది అనేది అవాస్తవం. సదరు సంస్థ అలాంటి ప్రకటనేది చేయలేదు. యానిమేషన్ వర్కర్స్ యునైటెడ్(Animation Workers Ignited) అనే ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో "కార్టూన్ నెట్‌వర్క్ తప్పనిసరిగా మూతపడిపోతుంది" అని ఒక యానిమేషన్ వీడియో పోస్ట్ చేయడంతో ఈ వార్త జోరందుకుంది. యానిమేషన్ రంగంలో ఉద్యోగాల కోతల(లేఆఫ్స్)పై అవగాహన పెంచడానికి చేసిన వీడియోతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది.
Cartoon Network is dead?!?!
— Animation Workers Ignited (@AWorkersIgnited) July 8, 2024
Spread the word about what’s at stake for animation!!! Post about your favorite Cartoon Network shows using #RIPCartoonNetwork
Active members of TAG can help by filling out your survey! Today (7/8) is the last day! pic.twitter.com/dHNMvA1q0A
కోవిడ్ అనంతరం క్షీణతలో ఉన్న కంపెనీలన్నీ లేఆప్స్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. చిన్న చిన్న సంస్థల మొదలు పేరున్న బడా బడా కంపెనీల వరకు ఉన్నట్టుండి వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తూ భయాన్ని పుట్టిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కార్టూన్ యానిమేషన్ వర్కర్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని, యానిమేషన్ వర్కర్స్ యునైటెడ్ చేసిన ఒక వీడియో కార్టూన్ నెట్‌వర్క్ షట్ డౌన్ కథనానికి దారితీసింది. ఈ విషయం తెలియని కార్టూన్ ప్రియులు.. #RIPCartoonNetwork హ్యాష్‌ట్యాగ్ పోస్ట్ చేస్తూ అధ్యాయం ముగిసిందంటూ సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.
Its sad to see the most iconic building in everybody's childhood
— Sumit (@SumitHansd) July 9, 2024
Rest in peace cartoon network studios.
So weird and painful to say goodbye to an iconic piece of history
Thanks for the memories ❤️?
#RIPCartoonNetwork pic.twitter.com/ssKWT0ZpJw