
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి( Rishab Shetty) అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించిన సినిమా కాంతారా. 2021 లో రిలీజైన ఈ సినిమా ఇంటర్నేషనల్ వైడ్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అందుకుంది. ప్రస్తుతం కాంతారా సినిమాకు ప్రీక్వెల్ను(Kantara Prequel) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా టీజర్ రిలీజ్ చేయగా..ఇప్పటికీ అదే ట్రేండింగ్ హవా నడుస్తోంది.ఇందులో రిషబ్ ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రిషబ్ శెట్టి..ఈ ప్రీక్వెల్ కోసం హై లెవెల్ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం. కాంతారా కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించి దాదాపు రూ.400 కోట్ల వరకు కల్లెక్షన్స్ సాధించి కన్నడ ఇండస్ట్రీలోనే బాక్సాపీస్ బాద్షా అనిపించుకుంది. కానీ, రిషబ్ శెట్టికి దక్కింది మాత్రం కేవలం రూ.4 కోట్లు మాత్రమే. దీంతో ఈ ‘కాంతార ప్రీక్వెల్’ కోసం రిషబ్ శెట్టి ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నాడని న్యూస్ వినిపిస్తోంది. అంటే అతని రెమ్యునరేషన్ 25 రెట్లు పెంచేసాడన్న మాట.
అంతేకాకుండా..ఈ సినిమా షూటింగ్ కు ముందే రూ.50 కోట్లు అడ్వాన్స్ అందినట్లు తెలుస్తోంది. ఇక కాంతారా ప్రీక్వెల్ డిజిటల్, థియేటర్స్ హక్కులు అమ్మిన తర్వాత వచ్చే లాభాల్లో కూడా వాటా తీసుకోబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
కాంతార చాప్టర్-1 ప్రీక్వెల్ కి కూడా హీరో రిషబ్ శెట్టినే కథను అందిస్తూ..దర్శకత్వం వహిస్తున్నారు.ఈ మూవీని హొంబాలే ఫిల్స్మ్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు.