Kantara Chapter1 Box Office: హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ప్రభంజనం.. రూ.500 కోట్లు దాటిన కాంతార ఛాప్టర్ 1 వసూళ్లు

Kantara Chapter1 Box Office: హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ప్రభంజనం.. రూ.500 కోట్లు దాటిన కాంతార ఛాప్టర్ 1 వసూళ్లు

‘కాంతార’తో హీరోగా, దర్శకుడిగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్‌ శెట్టి (Rishab Shetty). ఇప్పుడీ విజయవంతమైన చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్‌ 1’ తెరకెక్కించి రికార్డులు కొల్లగొడుతున్నాడు. అక్టోబర్ 2న రిలీజైన ‘కాంతార చాప్టర్‌ 1’, కేవలం 10 రోజుల్లోనే (అక్టోబర్ 10నాటికి) బాక్సాఫీస్ దగ్గర రూ.500 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా ఈ విషయాన్నీ మేకర్స్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసి వసూళ్ల వివరాలు వెల్లడించారు. 

‘‘దైవిక సినీ తుఫాను బాక్సాఫీస్ వద్ద మరింత పైకి ఎగురుతోంది. ‘కాంతార ఛాప్టర్ 1’ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ.509.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. బ్లాక్‌బస్టర్ కాంతార మీ సమీపంలోని థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ మూవీ ఫస్ట్ డే నుంచే హిట్ టాక్‌తో దూసుకెళ్తూ ప్రపంచవ్యాప్తంగా కాసుల వర్షం కురిపిస్తోంది.

అయితే, ఇప్పటివరకు ఈ 2025 ఏడాది రూ.600 కోట్లతో 'ఛావా' మూవీ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలవగా.. త్వరలోనే 'కాంతార 1' ఫస్ట్ ప్లేస్‌లోకి వెళ్లనుంది. ప్రస్తుతం ఈ వారం థియేటర్లో కాంతారాను బీట్ చేసే సత్తా ఉన్న సినిమా ఏది లేకపోవడడం కలిసొచ్చే అంశం. దీపావళి వరకు థియేటర్లను శాసించే దమ్ము కాంతారాకే ఉంది. ఇకపోతే ఈ మూవీ ఇండియా బాక్సాఫీస్ వద్ద రూ.342కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించి, వేట కొనసాగిస్తోంది.

'కాంతార ఛాప్టర్ 1' కథ:

ఇది క్రీ.శ. 300లో.. అంటే 2022లో రిలీజైన కాంతార సినిమాకు ప్రీక్వెల్ అయిన 'కాంతార ఛాప్టర్ 1' కథ, మొదటి సినిమా సంఘటనలకు వెయ్యి సంవత్సరాల ముందు జరుగుతుంది. కదంబ రాజవంశం కాలంలో అడవులు, తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భూత కోల ఆచారాల మూలాలను అన్వేషిస్తుంది. రిషబ్ శెట్టి శక్తివంతమైన యోధుడు బెర్మే అనే నాగ సాధువు పాత్రలో నటించగా, జయరామ్ విజయేంద్ర రాజుగా, రుక్మిణి వసంత్ కనకవతిగా, గుల్షన్ దేవయ్య కులశేఖరగా నటించారు.

►ALSO READ | Trisha Krishnan: త్వరలోనే త్రిష పెళ్లి? ఆ వ్యాపారవేత్తతో వైవాహిక జీవితంలోకి సౌత్ క్వీన్!

ఈ చిత్రం కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసమే కాక, దానిలోని ఆధ్యాత్మిక లోతు, సాంస్కృతిక ప్రాతినిధ్యం, స్వయంప్రతిపత్తి కోసం చేసిన పోరాటాన్ని చూపిస్తుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత రిషబ్ నటన, విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు 'కాంతార ఛాప్టర్ 2' అనే మూడవ భాగం కూడా ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.