కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. దసరా పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆక్టోబర్ 2న గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ దూసుకుపోతోంది. తొలి భాగం 'కాంతార' సాధించిన జీవితకాల వసూళ్లను కేవలం ఆరు రోజుల్లోనే దాటేసిన ఈ కన్నడ పిరియడ్ యాక్షన్ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. లేటెస్ట్ గా ఈ చిత్రంలోని 'బ్రహ్మకలశ' ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
తొలి రోజు నుంచి ఈ మూవీపై పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు 'కాంతార: చాప్టర్ 1' బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లకు క్యూకడుతూ.. కాసుల వర్షం కురిస్తున్నారు. తొలి నాలుగు రోజుల్లో అద్భుతమైన వసూళ్లు సాధించిన ఈ చిత్రం, ఐదో రోజు సోమవారం 50 శాతం టికెట్ అమ్మకాలు తగ్గినా మౌత్ టాక్ తో ఆరో రోజు మంగళవారం మళ్లీ ఊపందుకుంది. 2 గంటల 29 నిమిషాల నిడివితో ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ చిత్రాలను సైతం బోల్తా కొట్టించి దూసుకెళ్తోంది.
బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జోరు..!
'కాంతార: చాప్టర్ 1' విడుదలైన ఆరు రోజుల్లోనే భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ. 290.25 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దీనితో, యష్ 'KGF' సిరీస్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో కన్నడ చిత్రంగా ఇది చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.427.5 కోట్లు వసూలు చేసింది. విదేశీ బాక్సాఫీస్ కలెక్షన్లు దాదాపు రూ.65 కోట్లకు పైగా నమోదయ్యాయి. ఈ చిత్రం మరో రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరేందుకు సిద్ధంగా ఉంది.
పెరుగుతున్న ఆక్యుపెన్సీ రేట్లు..
విడుదలైన ఆరో రోజు మంగళవారం కూడా పీరియడ్ ఫోక్ యాక్షన్ థ్రిల్లర్ 'కాంతార: చాప్టర్ 1' పలు ప్రాంతాలలో అద్భుతమైన ఆక్యుపెన్సీని కనబరిచింది. కన్నడలో దాదాపు 78.90% ఆక్యుపెన్సీ నమోదు కాగా, మైసూర్ లో 93%, బెంగళూరులో 82% ఉంది. ఇతర భాషల్లోనూ ఈ చిత్రం బలమైన వసూళ్లు నమోదు చేసింది.
కథాంశం..
హోంబాలే ఫిల్మ్స్ (KGF ఫేమ్) నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్గా వచ్చింది. ఇది క్రీ.శ. 300లో కదంబ రాజవంశం కాలంలో అడవులు, తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భూత కోల ఆచారాల మూలాలను అన్వేషిస్తుంది. రిషబ్ శెట్టి శక్తివంతమైన యోధుడు బెర్మే అనే నాగ సాధువు పాత్రలో నటించగా, జయరామ్ విజయేంద్ర రాజుగా, రుక్మిణి వసంత్ కనకవతిగా, గుల్షన్ దేవయ్య కులశేఖరగా నటించారు.
►ALSO READ | Pooja Hegde: మోనికా పాటతో పూజా కెరీర్ టర్న్.. దుల్కర్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్..!
ఈ చిత్రం కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసమే కాక, దానిలోని ఆధ్యాత్మిక లోతు, సాంస్కృతిక ప్రాతినిధ్యం కోసం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది. 'కాంతార' ఫ్రాంచైజీ కేవలం వినోదం మాత్రమే కాక, మన సజీవ వారసత్వం, విశ్వాసం యొక్క ప్రతీకగా నిలిచిందని అభినందిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి ...
