Pooja Hegde: మోనికా పాటతో పూజా కెరీర్ టర్న్.. దుల్కర్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్..!

Pooja Hegde: మోనికా పాటతో పూజా కెరీర్ టర్న్.. దుల్కర్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్..!

దుల్కర్ సల్మాన్-పూజా హెగ్డే కలయికలో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకం మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రవి నేలకుడిటి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమాతో పూజా హెగ్డే మూడేళ్ళ తర్వాత టాలీవుడ్కి రీ ఎంట్రీ ఇస్తుంది. ఈ క్రమంలో పూజా హెగ్డేకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదే తాను తీసుకోబోయే రెమ్యునరేషన్. 

లేటెస్ట్ బాలీవుడ్ నివేదికల ప్రకారం.. దుల్కర్ సినిమా కోసం పూజా హెగ్డే రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారట. అయితే, రాధేశ్యామ్, ఆచార్య, ఎఫ్ 2 (స్పెషల్ సాంగ్) తర్వాత తెలుగు సినిమాల్లో పూజా నటించలేదు. అందుకు కారణం తన వరుస ఫెయిల్యూర్స్ అని, హై రెమ్యునేషన్ తీసుకోవడమే అని టాక్ నడిచింది.

►ALSO READ | Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేషన్ వార్: రీతు-పవన్ వర్సెస్ తనుజ-కల్యాణ్.

ఈ క్రమంలోనే  దుల్కర్ సినిమా కోసం ఏకంగా రూ.3 కోట్లు తీసుకుంటుందనే వార్తలు వస్తుండటంతో పూజా ట్రెండింగ్లో నిలిచింది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పూజా డీసెంట్ లుక్స్ సినిమాపై మంచి క్యూరియాసిటీ పెంచేలా చేసింది.

అలాగే, ఇటీవల రజనీకాంత్ కూలీ సినిమాలోని మోనికా పాటలో పూజా అదరగొట్టింది. తన స్పెషల్ డ్యాన్స్ స్టెప్పులతో కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంది. ఈ సాంగ్ పెద్ద హిట్ అవ్వడమే, పూజా కెరీర్కి మరింత తోడ్పడిందని సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి దుల్కర్ సల్మాన్ సినిమా కూడా సక్సెస్ అయితే.. మరిన్ని టాలీవుడ్ ప్రాజెక్టులతో పూజా బిజీగా ఉండొచ్చు!!