
బిగ్ బాస్ 9 తెలుగు హౌస్‌లో అయిదో వారం నామినేషన్ల పర్వం ఊహించని మలుపులు తిరిగింది. కెప్టెన్ రాము రాథోడ్, గోల్డెన్ స్టార్ ఇమ్యూనిటీతో ఇమ్మాన్యుయేల్ మినహా, మొత్తం 10 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ గండంలో చిక్కుకున్నారు. ఈ వారం టాస్క్‌లు, కంటెస్టెంట్ల అతి దూకుడు ఆటతీరు వారి ఓటింగ్ శాతాలను తారుమారు చేశాయి. దీంతో డేంజర్ జోన్ నుంచి బయటపడేందుకు కంటెస్టెంట్లు తమ ఆట తీరుతో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వైల్డ్ కార్డ్‌లు రాబోతున్నారనే బిగ్ బాస్ హెచ్చరికల నేపథ్యంలో, ఈ వారం ఆట మరింత హోరాహోరీగా మారింది.
ఫౌల్ గేమ్‌తో భగ్గుమన్న బిగ్ బాస్!
ఈ వారం నామినేటెడ్ కంటెస్టెంట్లను ఐదు జోడీలుగా విభజించి, బిగ్ బాస్ ఛాలెంజింగ్ టాస్క్‌లు ఇచ్చారు. ఈ టాస్క్‌లలో, ముఖ్యంగా బెలూన్ టాస్క్‌లో, గెలవాలనే తపనలో చాలా జంటలు తమ హద్దులు దాటాయి. అందరి కంటే ఎక్కువగా, రీతు చౌదరి, డీమాన్ పవన్ జంట అనైతిక ఆటతీరును ప్రదర్శించింది. వారి అతి దూకుడు, నియమాలను పట్టించుకోకపోవడంపై బిగ్ బాస్ తీవ్రంగా స్పందించారు. వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆటలో గెలవడంతో పాటు, గెలిచే విధానం కూడా ముఖ్యమనే పాయింట్‌ను ఈ జంట విస్మరించింది. పైగా, బిగ్ బాస్ హెచ్చరించినా వారి ఆర్గ్యుమెంట్స్ కొనసాగించడం ప్రేక్షకుల్లో తీవ్ర నెగెటివ్ అభిప్రాయానికి తెచ్చిపెడుతోంది..
డేంజర్ జోన్‌లో రీతు - పవన్
ప్రస్తుత అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్‌లో ఈ ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో పడిపోయారు. డీమాన్ పవన్ 6.34 శాతంతో 9వ స్థానంలో ఉన్నారు. ఇక రీతు చౌదరి 6.22 శాతంతో 10 వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుత ఓటింగ్ శాతం ప్రకారం, రీతు చౌదరి చివరి స్థానంలో ఉంది. ఆమె ఆటతీరుపై వచ్చిన నెగెటివిటీ, పవన్ అతి దూకుడు కలసి వారికి ఓట్లు తగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, రీతు చౌదరి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
►ALSO READ | Bigg Boss House Sealed: బిగ్ బాస్ హౌస్ సీజ్.. అర్ధరాత్రి సీక్రెట్‌గా కంటెస్టెంట్లను రిసార్ట్‌కు తరలింపు.!
టాప్‌లో సీరియల్ హీరోయిన్ ..
ఓటింగ్‌లో అనూహ్యంగా, సీరియల్ నటి తనుజ అగ్రస్థానంలో దూసుకుపోతోంది. ఆమె స్థిరమైన, పద్ధతిగా కూల్‌గా ఆడే గేమ్ ప్రేక్షకులకు బాగా నచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం తనుజ 18.29 శాతం ఓట్లతో టాప్ లో ఉంది. కల్యాణ్ పడాల 15.46 శాతం ఓట్లతో తన పార్ట్‌నర్‌తో కలిసి రెండో స్థానంలో స్థిరంగా ఉన్నాడు. వీరితో పాటు సుమన్ 13.28 శాతం ఓటింగ్ తో మూడో స్థానంలో ఉండగా, మిగిలిన కంటెస్టెంట్లు భరణి, సంజన, ఫ్లోరా, శ్రీజ, దివ్య నిఖిత స్వల్ప తేడాతో మిడిల్ రేంజ్‌లో ఉన్నారు. చివరి రెండు స్థానాల్లో ఉన్న రీతు, పవన్ మినహా మిగతా వారంతా ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ఐదో వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే ఆ కంటెస్టెంట్ రీతు చౌదరేనా, లేదా చివరి నిమిషంలో డీమాన్ పవన్ తన స్థానాన్ని మార్చుకుంటాడా అనేది ఉత్కంఠగా మారింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల నేపథ్యంలో, ఈ వారం ఎలిమినేషన్ మరింత పకడ్బందీగా ఉంటుందని బిగ్ బాస్ వర్గాలు సూచిస్తున్నాయి.