Kantara2 Box Office Day4: 'కాంతార: చాప్టర్ 1' రికార్డుల మోత!.. కన్నడ కంటే హిందీలోనే రిషబ్ శెట్టి హవా!

Kantara2 Box Office Day4: 'కాంతార: చాప్టర్ 1' రికార్డుల మోత!.. కన్నడ కంటే హిందీలోనే రిషబ్ శెట్టి హవా!

భారతీయ సినీ చరిత్రలో మరో సంచలనానికి తెరతీసింది  పీరియడ్ ఫోక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కాంతార: చాప్టర్ 1' .  దసరా సందర్భంగా అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది.  ఇప్పుడు ఈ మూవీ మౌత్ టాక్ తో రికార్డుల మోత మోగిస్తోంది.  కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా హోంబాలే ఫిల్మ్స్ మరోసారి అసాధారణ విజయాన్ని సొంతం చేసుకుంది.

పాన్-ఇండియా రికార్డుల మోత

బాక్సాఫీస్ వద్ద 'భూతకోల' సృష్టిస్తున్న విజృంభణ అంతా ఇంతా కాదు. రిలీజైన మొదటి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన వసూళ్లు అంచనాలకు మించిపోయాయి. దర్శకుడు, నటుడు అయిన రిషబ్ శెట్టి సృష్టించిన ఈ దృశ్య కావ్యం, ప్రేక్షకుల గుండెల్లో దైవత్వాన్ని, ఉద్వేగాన్ని నింపుతూ దూసుకుపోతోంది. సినీ ట్రెడ్ విశ్లేషణ సంస్థ సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం, కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.335 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇది ఈ సంవత్సరంలోనే అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్‌ రికార్డుగా నిలిచింది.

అద్భుతమైన ఓపెనింగ్ తో మొదలై..

'కాంతార: చాప్టర్ 1' మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ తో 61.85 కోట్ల భారీ వసూళ్ల  సాధించింది. రెండో రోజు శుక్రవారం 26 శాతం తగ్గి రూ. 45.4 కోట్లు వసూలు చేసినప్పటికీ, శనివారం అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది. 21 శాతం పెరుగుదలతో రూ.55 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజైన ఆదివారం రోజున రూ.61.5 కోట్లు రాబట్టి, మొదటి రోజు వసూళ్లకు దాదాపు సమానంగా నిలిచింది. ఇది సినిమాకు ఉన్న బలమైన వర్డ్ ఆఫ్ మౌత్‌కు నిదర్శనంగా నిలిచింది. దేశియంగా ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 223.75 కోట్ల నెట్ వసూళ్లు సాదించింది.

 హిందీలోనూ హవా!

'కాంతార: చాప్టర్ 1' కేవలం కన్నడ మార్కెట్‌కే పరిమితం కాలేదు. ఇది నిజమైన పాన్-ఇండియా సినిమాగా తన సత్తా చాటింది. ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో ఈ సినిమా ప్రదర్శన సినీ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆదివారం నాడు సినిమా మొత్తం దేశీయ వసూళ్లు రూ.61.5 కోట్లకు కాగా. దానిలో రూ.23.5 కోట్లు హిందీ వెర్షన్ నుంచే వచ్చాయి. ఇది కన్నడ వెర్షన్ (రూ.15.5 కోట్లు) కంటే కూడా అధికంగా ఉండడం విశేషం.  ఆదివారం రోజున ఈ సినిమా అన్ని భాషల్లోనూ అద్భుతమైన ఆక్యుపెన్సీని నమోదు చేసింది.

రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక ప్రదర్శన!

భారతీయ సినిమా చరిత్రలో 'కాంతార: చాప్టర్ 1' మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ ప్రాంతీయ చిత్రం, అక్టోబర్ 5, ఆదివారం నాడు ఏకంగా రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించారు.. ఒక ప్రాంతీయ సినిమాకు లభించిన ఈ అరుదైన అవకాశం. ఈసినిమా గొప్పదనాన్ని, సాంస్కృతిక విలువను చాటుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. 'కాంతార: చాప్టర్ 1' చిత్రం కేవలం ఒక సినిమాగా కాకుండా, భారతదేశ మూలాల్లోని దైవ సంబంధమైన జానపద కథలను , లోతైన సాంస్కృతిక అస్తిత్వాన్ని శక్తిమంతంగా తెరకెక్కించారని కొనియాడారు. ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనకు చిత్ర బృందం హాజరైంది.

►ALSO READ | Rajamouli: రాజమౌళి ఫాల్కే బయోపిక్‌కు హీరోల కొరత: ఎన్టీఆర్-ప్రభాస్ వల్లే ప్రాజెక్టుకు బ్రేక్..!

 రిషబ్ శెట్టి నటన, అజనీష్ లోక్‌నాథ్ అందించిన ఉద్వేగభరితమైన సంగీతం (BGM) , హోంబలే ఫిలింస్ నిర్మాణ విలువలు ఈ అపూర్వ విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయంటున్నారు సినీ పండితులు.  'కాంతార: చాప్టర్ 1' విజయంతో, కన్నడ సినిమా చరిత్రలో ఇది మూడవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది. దీని మునుపటి తొలి భాగం 'కాంతార' (రూ.408 కోట్లు) , 'KGF: Chapter 2' (రూ.1215 కోట్లు) మాత్రమే ఇప్పుడు దీనికి ముందున్నాయి. ఒక ప్రాంతీయ కథాంశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన రిషబ్ శెట్టి విజయం భారతీయ సినిమాకి ఒక కొత్త దిశానిర్దేశం చేసిందని చెప్పవచ్చు అంటున్నారు  ట్రేడ్ పండితులు..