
దుబాయ్: ఇండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించాడు. బుధవారం విడుదలైన ఐసీసీ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో పంత్ పది నుంచి ఐదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. కానీ, ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ ఆరేళ్లలో తొలిసారి టాప్10లో చోటు కోల్పోయాడు. కోహ్లీ 9 నుంచి 13వ ప్లేస్‌కు పడిపోగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంక్‌కు పడిపోయాడు. మరోవైపు ఫుల్ ఫామ్‌లో ఉన్న జో రూట్ 923 రేటింగ్ పాయింట్లతో తన టాప్ ర్యాంక్‌ను మరింత బలోపేతం చేసుకున్నాడు. లబుషేన్, స్టీవ్ స్మిత్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కెరీర్ బెస్ట్ ఫామ్‌తో దూసుకెళ్తున్న జానీ బెయిర్ స్టో ఏకంగా 11 ప్లేస్‌లు మెరుగై పదో ర్యాంక్ సొంతం చేసుకున్నాడు.