సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం : రిషబ్ పంత్

 సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం  : రిషబ్ పంత్

ఇటీవల కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న క్రికెటర్ రిషబ్ పంత్ తొలిసారి ట్వీట్  చేశాడు. తన గురించి ప్రార్థించిన ఫ్యాన్స్, తోటి సహచరులు, వైద్యులకు కృతజ్ఞతలు తెలిపాడు. తన సర్జరీ విజయవంతంగా పూర్తియిందని తెలిపిన పంత్ నెమ్మదిగా కోలుకుంటున్నట్లుగా చెప్పాడు. ఈ క్రమంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను  సిద్ధంగా ఉన్నట్లుగా తన ట్వీట్ లో పేర్కొన్నాడు.  

ఇక తనకు మద్దతుగా నిలిచిన బీసీసీఐ, అధ్యక్షుడు జైషాకు ధన్యవాదాలు తెలిపాడు. అందరిని మైదానంలో కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నట్లుగా పంత్ పేర్కొన్నాడు. కాగా డిసెంబర్ 30 తెల్లవారుజామున న్యూఢిల్లీకి డ్రైవింగ్ చేస్తూ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పంత్ కనీసం 18 నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వస్తుందని వైద్యులు తెలిపారు. ఇటీవలే పంత్ ఐపీఎల్ కు దూరం కానున్నాడని మాజీ క్రికెటర్, ఢిల్లీ డైరక్టర్ సౌరవ్ గంగూలీ ప్రకటించారు.