డౌనింగ్ స్ట్రీట్ ఫ్లాట్ లోకి రిషి సునక్ కుటుంబం

డౌనింగ్ స్ట్రీట్ ఫ్లాట్ లోకి రిషి సునక్ కుటుంబం

బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునక్ నిరాడంబరమైన జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు. తనకు ఎన్నో విలాసవంతమైన ఆస్తులు ఉన్పప్పటికీ.. తన కుటుంబంతో కలిసి చిన్న ఇంట్లో ఉండాలని భావిస్తున్నారు. రిషి సునక్ భార్య తన ఇద్దరు పిల్లలు, తన పెంపుడు కుక్కతో కలిసి.. డౌనింగ్ స్ట్రీట్ నెంబర్ 10లో ఉన్న  ఫ్లాట్ లో నివసించాలని అనుకుంటున్నారు. 

రిషి సునక్ ఆస్తులు

రిషి సునక్ కు పోర్ట్‌ఫోలియోలోని కాలిఫోర్నియాలో ఒక పెంట్ హైస్, లండన్‌లోని కెన్సింగ్‌టన్ జిల్లాలో ఒక అపార్ట్‌మెంట్, ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్‌షైర్ నియోజకవర్గంలో ఒక భవనం ఉన్నాయి. కాని ఇవన్నీ వదిలిపెట్టి.. డౌనింగ్ స్ట్రీట్ లోకి మారుతున్నట్లు తెలిపారు. బ్రిటన్ లోని అత్యంత సంపన్నులైన 250 మంది జాబితాలో రిషి సునక్ ఒకరుగా ఉన్నారు. రిషి సునక్ భార్య ఆస్తుల విలువ సుమారుగా ఏడు వేల కోట్లు ఉంటుంది. బ్రిటన్ సంప్రదాయం ప్రకారం.. ఆ దేశ నాయకులు డౌనింగ్ స్ట్రీట్ నంబర్ 10 పైన ఉన్న ఫ్లాట్‌లో నివసించేవారు. ఇందులో దేశ ప్రధాన మంత్రుల అధికారిక నివాసంతో పాటు ప్రధాని కార్యాలయం కూడా ఉంది. సాధారణంగా ఛాన్సలర్లు నంబర్ 11లో ఉన్న పెద్ద ఫ్లాట్ లో నివసించేవారు. 

అయితే, గతంలో టోనీ బ్లెయిర్, గోర్డాన్ బ్రౌన్ లు ప్రధానమంత్రులుగా ఉన్నప్పుడు తమ కుటుంబాలకు అనుగుణంగా ఫ్లాట్ లను మార్చుకున్నారు. వాస్తవానికి, సునక్ ఇటీవలే 10వ నంబర్ ఫ్లాట్ నుంచి బయటకు వెళ్లారు. బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రిషి ఆర్థిక మంత్రిగా పనిచేశారు. గత జూలైలో ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన.. అప్పటివరకు 10వ నంబర్ ఫ్లాట్ లోనే నివసించారు. ఇప్పుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. మళ్లీ డౌనింగ్ స్ట్రీట్ లోకి వెళ్లాలని భావిస్తున్నారు.