చలికాలంలో గుండెపోటు వచ్చే ఛాన్స్ : కార్డియాలజిస్టులు

చలికాలంలో గుండెపోటు వచ్చే ఛాన్స్ : కార్డియాలజిస్టులు

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఏజ్ గ్రూపులోనూ గుండెపోటులు వచ్చే సంఘటనలు ఎక్కువవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ శీతాకాలంలో గుండె జబ్బులతో పోరాడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చల్లని వాతావరణం గుండెను అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని పలువురు చెబుతున్నారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ చల్లని వాతావరణంలో మన హృదయాన్ని రక్షించుకోవాలనే దానిపై  క్లారిటీ ఉండాలని అంటున్నారు. 

అయితే శీతాకాలంలో మామూలుగానే గుండెపోటులు పెరుగుతాయని న్యూఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్ ని సీనియర్ కార్డియాలజిస్ట్ డా. మనోజ్ కుమార్ చెప్పారు. సాధారణంలో వృద్ధులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, కానీ... ప్రస్తుతం అది యువతలోనూ కనిపిస్తోందని తెలిపారు. దీన్ని నివారించాలంటే ఆరుబయట మార్నింగ్ వాక్ లకు దూరంగా ఉండాలని ఆయన సూచనలిస్తున్నారు. మందపాటి దుస్తులు ధరించాలని, చలికాలంలో బయటికి వెళ్లే ముందుకు తలను కవర్ చేయాలని అంటున్నారు. చలికాలంలో రక్తనాళాలు సంకోచించడం కూడా దీనికి కారణమైతుందని, దీన్నే వాసోకాన్ర్స్టిక్షన్ అంటారని చెప్పారు. చిన్న కండరాల ద్వారా రక్తనాళాలల గోడలలు సంకోచం చెంది రక్తపోటుకు కూడా దారి తీయొచ్చని హెచ్చరించారు.

కరోనరీ ధమనుల్లో రక్త గడ్డ కట్టడం వల్ల గుండెపోటు వస్తుంది. శీతాకాలంలో మన శరీరంలో ఫైబ్రినోజన్ స్థాయిలు 23శాతం పెరుగుతాయి. అంతే కాకుండా ప్లేట్ లెట్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఇది రక్తం గడ్డ కట్టడానికి కారణమవుతుంది. గుండెపోటుకు దారి తీస్తుందని డా. కుమార్ స్పష్టం చేశారు. కాబట్టి హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఈ శీతాకాలంలో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని ఆయన సూచించారు. విటమిన్ డి లోపం కూడా గుండెపోటుకు కారణం కావచ్చని, కాబట్టి తగు జాగ్రత్తలు పాటించక తప్పదని ఆయన చెప్పారు.