Ritika Singh : క్షణాల్లో జరిగిపోయింది..షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్

Ritika Singh : క్షణాల్లో జరిగిపోయింది..షూటింగ్‌లో గాయపడ్డ హీరోయిన్

రజినీ కాంత్‍ (Rajinikanth) తలైవర్170 (Thalaivar170) వర్కింగ్ టైటిల్ తో వస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్(Tj Gnanavel) డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా, బోల్డ్ అండ్ డైనమిక్ పర్ఫార్మర్ రితికా సింగ్(Ritika Singh), తమిళ యాక్టర్ దుషార విజయన్ కీ రోల్స్ లో నటిస్తున్నారు. 

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ మూవీలో ప్రమాదం చోటు చేసుకుంది. హీరోయిన్  రితికాసింగ్ గాయపడినట్లు తన ఇంస్టాగ్రామ్ లో చేతులకు గాయాలైన ఫోటో, వీడియోను పోస్ట్ చేసింది. రిలీజ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ..'నేనెంతో బాధ పడుతున్నా..అక్కడ  ఓ గాజు అద్దం వల్లే ఇదంతా జరిగింది. బట్‌, ఇట్స్‌ ఓకే. జాగ్రత్త అని మేకర్స్ హెచ్చరించినప్పటికీ సడెన్ గా ప్రమాదం జారిగింది. కొన్నిసార్లు క్షణాల్లో జరిగే ప్రమాదాలను ఎవ్వరం ఆపలేము. అంతేకాదు ఈ ప్రమాదంలో నాకు చర్మం చాలా లోతుగా కట్ అయింది. హాస్పిటల్ లో ట్రేట్ మెంట్ తర్వాత షూటింగ్ లో పాల్గొంటా అని వీడియోలో తెలిపింది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వెంకటేష్ గురు సినిమాలో రితికా సింగ్ ను ఇష్టపడని వారు ఉండరేమో. తన నటనతో అంతలా ప్రేక్షకులను ఈ బ్యూటీ కట్టి పడేసింది. సోషల్​ మీడియాలో రితికాను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీ గానే ఉంది. బాక్సర్​ అయిన రితికా ఫిట్​ నెస్​ వీడియోలతోనూ ఆకట్టుకుంటుంది.ఇటీవల ఆమె ఇన్‌ కార్‌, కోలై సినిమాల్లో నటించింది.

ఇక..తలైవా 170 మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుబాస్కరన్‌ ఎంతో గ్రాండ్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. జైలర్ మూవీకి అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేసిన అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. జైభీమ్‌ వంటి సామాజిక సందేశాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన డైరెక్టర్ జ్ఞానవేళ్‌ తెరకెక్కిస్తోన్న ఈ మూవీని 2024 లో రిలీజ్ చేస్తున్నారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ritika Singh (@ritika_offl)