వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పను..రిపోర్టర్‌పై విరుచుకుపడిన జడేజా భార్య

వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పను..రిపోర్టర్‌పై విరుచుకుపడిన జడేజా భార్య

జడేజా తండ్రి అనిరుధ్‌సింగ్.. రివాబాతో వివాహం జరిగిన నాటి నుంచి తన కొడుకుతో సంబంధాలు తెగిపోయాయని.. కుటుంబంలో చీలికలు రావడానికి రివాబా కారణమని ఆయన కొన్ని రోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. అదే ఊరిలో ఉంటున్నప్పటికీ తన కొడుకు ముఖం కూడా చూడడం లేదని ఆయన తెలిపారు.జడేజా అతని భార్య రివాబాతో మాకు, మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని.. వారికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. 

రవీంద్ర జడేజా భార్య రివాబా ఆదివారం (ఫిబ్రవరి 11) ఒక బహిరంగ కార్యక్రమంలో తన మామ చేసిన ఆరోపణలపై స్పందించాలని రిపోర్టర్‌ కోరారు. అనిరుధ్‌సింగ్ జడేజాతో తనకున్న సంబంధాలపై ఒక రిపోర్టర్ ఆమెను ప్రశ్నలు అడగడంతో బీజేపీ ఎమ్మెల్యేకు కోపం వచ్చింది. పబ్లిక్ కార్యక్రమంలో ఉన్నప్పుడు వ్యక్తిగత ప్రశ్నలకు దూరంగా ఉండాలని రివాబా విలేఖరిని కోరారు. ఈ విషయం గురించి  తెలుసుకోవాలనుకుంటే.. తనని నేరుగా సంప్రదించాలని రివాబా ఆ  రిపోర్టర్ పై మండిపడింది.  

రివాబా జడేజా గుజరాత్ శాసనసభ సభ్యురాలిగా డిసెంబర్ 2022లో జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. ఆమె తరచుగా IPL , ఇండియా మ్యాచ్‌ల సమయంలో తన భర్త జడేజాకు మద్దతుగా ఉంటూ మ్యాచ్ లు చూడడానికి స్టేడియాలకు వెళ్తుంది. మరోవైపు జడేజా ప్రస్తుతం గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇంగ్లాండ్ జరిగిన తొలి టెస్టుకు ఆడిన తర్వాత గాయంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్ట్ కు ఎంపికైనా ఆడటం అనుమానంగానే మారింది. ఫిబ్రవరి 15 న రాజ్ కోట్ వేదికగా మూడో టెస్ట్ జరుగుతుంది.