
పాట్నా: బిహార్ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థిని నామినేషన్ వేసిన వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. ససారాం అసెంబ్లీ స్థానం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సతేంద్ర సాహ్ను జార్ఖండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గర్హ్వా జిల్లాలోని చిరౌంజియా మోర్లో 2004లో జరిగిన బ్యాంకు దోపిడీ కేసులో సతేంద్ర సాహ్ నిందితుడని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ఆ కేసులో సతేంద్ర సాహ్పై 2018లో ఎన్బీఏ జారీ అయిందన్నారు. ఆయనపై వివిధ స్టేషన్లలో 20కి పైగా కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.