The 100 Review: ‘ది 100’ రివ్యూ.. ‘మొగలి రేకులు’ఫేమ్ RK సాగర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

The 100 Review: ‘ది 100’ రివ్యూ.. ‘మొగలి రేకులు’ఫేమ్ RK సాగర్ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?

‘మొగలి రేకులు’ఫేమ్ RK సాగర్ హీరోగా నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘ది 100’. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో రమేష్ కరుటూరి, వెంకి పుషడపు నిర్మించారు. 

నేడు శుక్రవారం మూవీ (జూలై 11న) థియేటర్లలో విడుదలైంది. RKసాగర్ సరసన మిషా నారంగ్ నటించారు. ధన్య బాలకృష్ణ, నటరాజన్, టెంపర్ వంశీ కీలక పాత్రలు పోషించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

‘ది 100’ మూవీ ప్రారంభం నుంచి ఆడియన్స్లో హైప్ పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా మాజీ ఉప‌ రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు నుంచి మెగా బ్రదర్స్ వరకు ప్రమోషన్స్తో ఆకట్టుకున్నారు. అలా విడుద‌ల‌కు ముందే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన ‘ది 100’ ఎలా ఉంది? ప్రేక్షకుల్లో ఎలాంటి ఆస‌క్తిని రేకెత్తించింది? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

కథ:

IPS ట్రైనింగ్‌ పూర్తి చేసుకుని ఏసీపీగా బాధ్యతలు చేపడుతాడు విక్రాంత్‌ (ఆర్కే సాగర్‌). ఇదే సమయంలో సిటీలో వరుసగా రాబరీలు, మర్డర్స్ జరుగుతాయి. విక్రాంత్‌ ఛార్జ్ తీసుకున్న మరుక్షణమే ప్రజలను వణికిస్తున్న ఈ హత్యలపై ప్రత్యేక దృష్టి పెడతాడు. కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒడిశాకి చెందిన ఓ ముఠా దీని వెనుక ఉన్న‌ట్టు కనుక్కుంటాడు.

అలాగే, ఈ ఇన్వెస్టిగేషన్‌లో తన ప్రియురాలు ఆర్తి (మిషా నారంగ్) కూడా ఓ బాధితురాలని తెలుసుకుంటాడు. ఎట్టకేలకు ఆ కేసుని ఛేదించి ముఠాని ప‌ట్టుకుంటాడు. కానీ, ఆర్తికి జ‌రిగిన అన్యాయానికి, ఈ ముఠాకి సంబంధం లేదనే నిజం తెలుస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా హత్య చేయబడ్డ అమ్మాయిల విషయంలో కొన్ని నిజాలు బయటకొస్తాయి. వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన మధు (విష్ణుప్రియ) సూసైడ్ వెనుకున్న విషయాలపై ఫోకస్ పెడతాడు.

ఈ సిటీలో హత్యల వెనుక ఉన్నదెవరు? తన లవర్ ఆర్తిని టార్గెట్ చేసిన వ్య‌క్తులెవ‌రు? వరుస దోపిడీలు చేసేదెవరు? అసలు ఈ కేసులో నేరస్థులు ఎవరు? ఫైనల్‌గా ఆ కేసును విక్రాంత్ ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడు? అతనికి తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటనేదే మిగతా కథ

ALSO READ : కోస్టల్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ‘మార్షల్’.. కార్తి కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 29వ సినిమా

కథ విశ్లేషణ:

క్రైమ్ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులకు ఇష్టమే. మర్డర్స్, రాబరీస్, సూసైడ్స్ వంటి అంశాలతో వచ్చే సినిమాలన్నీ ఆదరిస్తుంటారు. కానీ, ఇవి ప్రేక్షకులకు మరింత నచ్చాలంటే సరైన స్క్రీన్ ప్లే, డిఫరెంట్ క్రైమ్ ప్యాటర్న్స్ ఉండాలి. అప్పుడే ఆడియన్స్ న్బు ఎంగేజ్ చేయటంలో మూవీ సక్సెస్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రేక్షకులకు ఊహ‌కంద‌ని క‌థ‌నం, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు పుష్కలంగా ఉండాలి. ది 100 మూవీ కూడా అదే కోవలో థ్రిల్‌ పంచుతూ సాగింది. ఈ క‌థ‌కి ఐపీసీలోని సెక్ష‌న్ 100ని ముడిపెడుతూ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ థ్రిల్లర్‌ మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.