బీఎస్ఈలో ఆర్ఎన్ఐటీ సొల్యూషన్స్ లిస్టింగ్

బీఎస్ఈలో ఆర్ఎన్ఐటీ సొల్యూషన్స్ లిస్టింగ్

హైదరాబాద్​, వెలుగు: ఏఐ  గవర్నెన్స్, ఎంటర్​ప్రైజ్​ ట్రాన్స్​ఫార్మేషన్​ సొల్యూషన్స్​ అందించే ఆర్ఎన్​ఐటీ ఏఐ సొల్యూషన్స్​ లిమిటెడ్ శుక్రవారం తన షేర్లను బీఎస్​ఈలో లిస్టింగ్​ చేసింది. స్టాక్​మార్కెట్లోకి వచ్చిన మొదటి ఏఐ కంపెనీ తమదేనని ఆర్ఎన్​ఐటీ ఏఐ సొల్యూషన్స్​ ఎండీ,  సీఈఓ రాజా శ్రీనివాస్​ నందిగామ తెలిపారు. 

మనదేశంలో పాలన, ఎంటర్​ప్రైజ్​ ట్రాన్స్​ఫార్మేషన్​కు ఏఐ వెన్నెముకగా మారాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్​ కేంద్రంగా పనిచేసే ఈ కంపెనీ రివర్స్​ మెర్జింగ్​ ద్వారా మెయిన్​బోర్డులో లిస్టింగ్​ అయింది. 

2023లో ఆర్ఎన్​ఐటీ సొల్యూషన్స్​ అండ్​ సర్వీసెస్,  ఆటోపాల్​ ఇండస్ట్రీస్​లో విలీనం అయింది. కంపెనీ పేరు ఆర్ఎన్​ఐటీ ఏఐ సొల్యూషన్స్​గా మారింది. ఇది ఏఐ ఆధారిత ఫేషియల్​, బెనిఫిషియరీ ట్రాకింగ్ ​సిస్టమ్​లను డెవెలప్​ చేసింది.