Durgam Cheruvu Bridge: కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

Durgam Cheruvu Bridge: కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులు బ్రిడ్జి పైన ఉన్న డివైడర్ని ఢీ కొట్టి కిందపడ్డారు. ఈ ఘటనలో బ్రిడ్జిపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓవర్ స్పీడ్తో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక మరో ఘటనలో.. రాయదుర్గంలో కారు డివైడర్ను ఢీ కొట్టడంతో ఇద్దరు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు.

 గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్ రోహిత్, జాబ్ సెర్చింగ్లో ఉన్న బాల ప్రసన్న  తెల్లవారుజామున మసీద్ బండ నుంచి హఫీజ్పేట్ వైపు బైక్పై వెళుతున్నారు. కొత్తగూడ ఫ్లైఓవర్పై అతి వేగంగా, నిర్లక్ష్యంగా బైకు నడపడటంతో ఫ్లైఓవర్ గోడను ఢీకొని ఫ్లైఓవర్ పై నుంచి కింది పడ్డారు. కిందపడిన ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనపై  గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. 

మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో ఘటనలో ఒకరు చనిపోయారు. తెల్లవారుజామున KPHB, హైటెక్ సిటీ మార్గంలో యశోద హాస్పిటల్ దగ్గర ఫ్లైఓవర్పై లారీ ఢీ కొని స్వామి శంకర్ అనే వ్యక్తి మృతి చెందాడు. ప్రవీణ్, స్వామి శంకర్ బైకుపై వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ప్రవీణ్ నిర్లక్ష్యంతో అతివేగంగా బైకు నడిపిన కారణంగానే ప్రమాదం జరిగిందని మాదాపుర్ పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్పై లారీ ఢీ కొట్టడంతో బైక్ వెనుక కూర్చున్న స్వామి శంకర్ ఫ్లైఓవర్పై నుంచి కిందపడి మృతి చెందాడు. బైకు నడుపుతున్న ప్రవీణ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బైకు నడుపుతున్న ప్రవీణ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీకెండ్లో ఒక్కరోజే హైదరాబాద్ నగరంలో ఇన్ని రోడ్డు ప్రమాదాలు జరగడం, ఇంత మంది చనిపోవడంతో నగరవాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.