హైదరాబాద్ నల్లగండ్ల ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం.. బైకును ఢీకొన్న రెడీమిక్స్ లారీ.. ఒకరు స్పాట్ డెడ్..

హైదరాబాద్ నల్లగండ్ల ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం.. బైకును ఢీకొన్న రెడీమిక్స్ లారీ.. ఒకరు స్పాట్ డెడ్..

హైదరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్ల ఫ్లైఓవర్ పై ఘోర ప్రమాదం జరిగింది. నల్లగండ్ల సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న బైకును రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ( జులై 10 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వెంకటరమణ అనే 30 ఏళ్ళ వ్యక్తి తెల్లాపూర్ నుండి నల్లగండ్ల ఫ్లైఓవర్ మీదుగా లింగంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

నల్లగండ్ల సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న వెంకటరమణను వెనుక నుంచి వచ్చిన రెడీమిక్స్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో తీవ్ర రక్తస్రావంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

హైదరాబాద్ లో ఈ మధ్య జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా లారీలు కారణం అవుతున్నాయని.. అతివేగంతో వచ్చే లారీలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు స్థానికులు.