ఆటోను ఢీకొన్న లారీ.. 12 మంది మృతి

ఆటోను ఢీకొన్న లారీ.. 12 మంది మృతి

 ఆటోను ఢీ కొట్టిన లారీ

12 మంది కూలీలు మృతి

మరో నలుగురి పరిస్థితి సీరియస్

ఆటోలో ఉన్నవాళ్లంతా కూలీలే

మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్

డ్రైవర్ అరెస్ట్

మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి దగ్గర ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 12మంది చనిపోయారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో 10మంది మహిళలున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. చనిపోయిన వారంతా కొత్తపల్లికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లింగయ్యతండాలో కూలీ పనులు చేసుకుని వెళ్తుండగా.. ప్రమాదం జరిగిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. ప్రమాద సమయంలో ఆటోలో 16మంది ఉన్నట్లు చెబుతున్నారు.

ఆటోను లారీ ఢీ కొట్టడంతో.. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మహబూబ్ నగర్ ఎస్పీ రెమా రాజేశ్వరి మృతదేహాలను పోస్ట్ మార్టంకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. బాధితుల బంధువులు అందుకు ఒప్పుకోవడంలేదు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన దిగారు. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన తర్వాతే డెడ్ బాడీలను తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఫోన్ చేసినా ఆలస్యంగా వచ్చిందంటూ 108పై దాడి చేశారు. త్వరగా వస్తే.. మరికొంతమంది బతికే అవకాశం ఉండేదని.. 108సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రమాదంలో చనిపోయిన వారు సేవ్య, సాలమ్మ, వడ్డి చెన్నయ్య, కటికె బాలమణి, బండారి ఎల్లమ్మ, రాగుల శివలీల, వెలికాట చంద్రమ్మ, ఎం.వెంకటమ్మ, బిచాడి, చాంది, శివాజీ నాయక్, బొల్లెపోగు వెంకటమ్మగా గుర్తించారు పోలీసులు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు