
పంజాగుట్ట ఫ్లై ఓవర్ పై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ జర్నలిస్టు మరణించాడు. బేగంపేట నుంచి నాగార్జున సర్కిల్ వైపు వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న జర్నలిస్ట్ మహ్మద్ తాజుద్దీన్ ఫ్లై ఓవర్ నుంచి కిదంపడడంతో చనిపోయాడు. మృతుడు కరీంనగర్ జిల్లా కు చెందిన వ్యక్తి గా పోలీసులు గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తి మద్యంమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని వాహనదారులు చెప్తున్నారు.
ప్రమాదం జరగడంతో ప్లై ఓవర్ పై అర్థ రాత్రి ట్రాఫిక్ జామ్ అయింది. ఆక్సిడెంట్ లో బైక్ నుజ్జు నుజ్జు అయింది. పోలీసులు క్రేన్ సాయంతో కారు,బైక్ ను అక్కడి నుండి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.