ఆరోగ్యం బాగాలేదు.. లొంగిపోయేందుకు సమయం కావాలన్న సిద్ధూ

ఆరోగ్యం బాగాలేదు.. లొంగిపోయేందుకు సమయం కావాలన్న సిద్ధూ

పంజాబ్ PCC మాజీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లొంగిపోయేందుకు కొన్ని వారాల పాటు గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు సిద్ధూ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ. మెడికల్ కండీషన్స్ దృష్ట్యా సిద్ధూకు కొంత టైం ఇవ్వాలన్నారు సింఘ్వీ. దీనిపై జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ ధర్మాసనం ముందు వివరణ ఇచ్చారు సింఘ్వీ. 3 దశాబ్దాల తర్వాత తీర్పు వచ్చిందని.. వైద్య సంబంధిత ఏర్పాట్లు చేసుకునేందుకు టైం కావాలన్నారు. ఈ కేసులో తీర్పును స్పెషల్ బెంచ్ ఇచ్చిందని... దానికి సంబంధించిన అప్లికేషన్ ను చీఫ్ జస్టిస్ ముందు ప్రవేశపెట్టాలని తెలిపింది కోర్టు. ఒకవేళ సీజేఐ (CJI) ఆ బెంచ్ ను ఇవాళే ఏర్పాటు చేస్తే.. దాన్ని అంగీకరిస్తామంది ఖాన్ విల్కర్ ధర్మాసనం. ఈ అంశాన్ని సీజేఐ ముందు ప్రస్తావిస్తామని తెలిపారు సింఘ్వీ.

34 ఏళ్ల నాటి కేసులో నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 34 ఏళ్ల క్రితం పాటియాలాలో కారు పార్కింగ్ విషయంలో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తితో సిద్ధూ, అతడి అనుచరుడు రూపీందర్ సింగ్ సంధులు గొడవ పడి తీవ్రంగా గాయపరిచారు. దీంతో తీవ్ర గాయలపాలైన గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 1999లో ఈ కేసు విచారించిన పాటియాలా సెషన్స్ కోర్టు... సాక్ష్యాలు లేవంటూ సిద్ధూ, అతడి అనుచరుడిని నిర్దోషులుగా ప్రకటించింది. 
మృతుడి కుటుంబ సభ్యులు పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు. 2006లో ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం సిద్ధూకు మూడేళ్ల జైలు శిక్షవిధిస్తూ  తీర్పును వెలువరించింది. దీంతో సిద్ధూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం కొనసాగిన ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు... ఆయనకు ఏడాది జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 

మరిన్ని వార్తల కోసం : -

జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్ 


చెయ్యి కూడా ఆయుధం అవుతుందన్న సుప్రీం