జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్ 

జైలు నుంచి విడుదలైన ఆజంఖాన్ 

సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ ఖాన్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇవాళ ఉదయం 8 గంటలకు ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. చీటింగ్ కేసు, భూ కబ్జాలు సహా పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆజంఖాన్ 27 నెలలుగా జైలులో ఉన్నారు. సుప్రీంకోర్టు గురువారం రాత్రి 11 గంటలకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆజంఖాన్ విడుదల అయ్యారు. ఆజంఖాన్ కు ఆయన కుమారుడు అబ్దుల్లా ఆంజా, శివపాల్ సింగ్ యాదవ్ సహా పలువురు నేతలు, పెద్ద సంఖ్యలో మద్దతు దారులు తరలివచ్చి జైలు బయట స్వాగతం పలికారు. ఎస్పీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ తన స్వస్థలమైన రాంపూర్ కు వెళ్లిపోయారు. ఆజంఖాన్ విడుదలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.

https://twitter.com/ANINewsUP/status/1527478498062831616 

మరిన్ని వార్తల కోసం

జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు స్వల్ప ఉద్రిక్తత

ప్రాంతీయం కాదు ప్రపంచ సినిమానే చూపెడుతోన్న ఓటీటీ