జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు స్వల్ప ఉద్రిక్తత

జూనియర్ ఎన్టీఆర్ ఇంటి ముందు స్వల్ప ఉద్రిక్తత

 టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  పుట్టిన రోజు సందర్భంగా  జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి దగ్గర అర్ధరాత్రి అభిమానులు హంగామ సృష్టించారు. తమ అభిమాన హీరో బర్త్ డే సందర్భంగా జూనియర్ ఫ్యాన్స్ భారీగా హైదరాబాద్ కు తరలివచ్చారు. అర్ధరాత్రి తారక్ ఇంటి వద్ద హడావుడి చేశారు. తారక్ ఇంటి ముందు కేక్ కట్ చేశారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన అభిమానులు.. ఆయన ఇంటి నుంచి బయటకు రావాలని నినాదాలు చేశారు. డ్యాన్సులతో రచ్చ చేశారు.

అర్ధరాత్రి కావడంతో ఫ్యాన్స్ హంగామా, అల్లరితో వాహనదారులు, స్థానికులు ఇబ్బంది పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఎన్టీఆర్ అభిమానులను పంపించేందుకు యత్నించారు. అయినా అభిమానులు పోలీసుల మాటలను  వినకపోవడంతో.. అభిమానులపై లాఠీచార్జ్ చేశారు. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పడంతో ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయారు.