అడుగుకో గుంత..  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధ్వానంగా మారిన రోడ్లు

అడుగుకో గుంత..  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధ్వానంగా మారిన రోడ్లు
  • అడుగుకో గుంత..  గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అధ్వానంగా మారిన రోడ్లు
  • గుంతలు, కంకరతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు
  • అధికార పార్టీ పెద్దలు వచ్చినప్పుడే హడావుడిగా పనులు చేస్తున్న ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు: పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది గ్రేటర్ వరంగల్ పరిస్థితి. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రోడ్లు అధ్వానంగా మారి స్థానికులకు, వాహనదా రులకు నరకం చూపుతున్నాయి. మెయిన్ రోడ్లే కాకుండా, ఇంటర్నల్ రోడ్లు కూడా డ్యామేజీ అయ్యా యి. ఎప్పటికప్పుడు రిపేర్లు చేయాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం మానేశారు. నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించాలంటేనే జనాలు  భయపడుతున్నారు.

రోడ్లపై ఫీటు లోతు గుంతలు

వరంగల్ నగరంలో రోడ్లపై ఫీటు లోతు గుంతలు పడడమే కాకుండా, రోడ్డు పొడవునా కంకర తేలింది. ముఖ్యంగా కేయూ నుంచి పెద్దమ్మ గడ్డ వెళ్లే రోడ్డు మరీ అధ్వానంగా మారింది. 100 ఫీట్ల రోడ్డు నుంచి గోపాలపూర్ జంక్షన్, హనుమకొండ హనుమాన్ టెంపుల్ నుంచి మచ్లీబజార్ లేన్, కాకాజీ కాలనీతో పాటు నిత్యం వేలాది మంది రాకపోలు సాగించే చాలా ఏరియాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే కొన్ని చోట్ల రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. గోపాలపూర్ కల్లు మండువ జంక్షన్ నుంచి భీమారం, పద్మాక్షి టెంపుల్ నుంచి శాయంపేట వద్ద రోడ్డు పనులు ఆగిపోయాయి. ఏడాదిన్నర కిందట 100 ఫీట్ల రోడ్డును తవ్వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు స్టార్ట్ చేశారు. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులను మధ్యలోనే నిలిపివేశాడు.

అధికార పార్టీ పెద్దలు వస్తేనే రోడ్లకు మోక్షం

రోడ్లు బాగాలేక ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని లీడర్లు, ఆఫీసర్లు.. అధికార పార్టీ పెద్దలు వస్తే మాత్రం ఆగమేఘాల మీద రోడ్లు వేస్తున్నారు. వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీ నుంచి భద్రకాళి టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్డు అధ్వానంగా మారింది. అయినా పట్టించుకోని ఆఫీసర్లు గతేడాది అక్టోబర్ లో ప్రతిమా క్యాన్సర్ హాస్పిటల్ ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భద్రకాళి గుడికి తీసుకువెళ్లేందుకు సుమారు రూ.30 లక్షలు ఖర్చు చేసి రాత్రికి రాత్రే రోడ్డు వేయించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ 57వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తున్నాడని తెలిసి టీవీ టవర్ కాలనీ, అమరావతినగర్, గాంధీ నగర్ మార్గాల్లో హడావుడిగా పనులు చేయించారు. వాస్తవానికి ఇక్కడ రూ.50 లక్షలతో సీసీ రోడ్డు వేసేందుకు శంకుస్థాపన చేశారు. కానీ మంత్రి కేటీఆర్ వస్తుండడంతో అప్పటికప్పుడు సీసీ వేసే అవకాశం లేక బీటీ రోడ్డు వేశారు. దీంతో అధికార పార్టీ ముఖ్య నేతలు వస్తేనే రోడ్లు వేస్తారా ? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సిటీలో రోడ్ల పరిస్థితిని పట్టించుకోని ఎమ్మెల్యేలు తమ క్యాంప్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల చుట్టూ మాత్రం చక్కని రోడ్లు వేసుకుంటుండడం పట్ల ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

యాక్సిడెంట్లు జరుగుతున్నయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

కేయూ – పెద్దమ్మగడ్డ రోడ్డులోని యాదవనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద రోడ్డు చాలా వరకు దెబ్బతింది. ఇక్కడ తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రాత్రివేళల్లో గుంతలు ఏర్పడక బండ్లు కింద పడుతున్నాయి. యాక్సిడెంట్ల కారణంగా వాహనదారులు గాయపడుతున్నారు. 
- గూడూరు రాజేశ్, యాదవనగర్, హనుమకొండ

రిపేర్లు చేయించాలె 

మా షాప్ ముందే రోడ్డు బాగా దెబ్బతింది. కంకర తేలి దుమ్ము కూడా లేస్తోంది. రోడ్లపై గుంతలు, కంకర వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. క్వాలిటీ లేని పనుల వల్ల రోడ్లు అధ్వాన్నంగా మారుతున్నాయి. 
- శ్రీధర్, దుకాణదారుడు, హనుమకొండ