
టెక్నాలజీలో అమెరికాతో పోటీ పడుతున్న చైనా.. గుడ్లతో రోడ్లు వేయడం చర్చనీయాంశంగా మారింది. తారు లేదా కాంక్రీట్ రోడ్లు వేస్తుంటారు. ఈ మధ్య ప్లాస్టిక్ రోడ్లు అంటూ కొత్త టెక్నాలజీ వచ్చింది. మరి ఎగ్స్ తో రోడ్లు వేయడమేంటా.. అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. #EggRoadChina అనే హ్యాష్ ట్యాగ్ తో ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇన్ స్టా, టిక్ టాక్ లో ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉండటంతో.. ఇండియాలో ఇది సాధ్యమా..? మన దగ్గర కూడా ఇలాంటి రోడ్లు వేయవచ్చా..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
రోడ్డు వేస్తున్న క్రమంలో రోడ్డుపై గుడ్డు పెంకలు వేస్తూ.. వాటిని రోడ్డు రోలర్ తో క్రష్ చేస్తున్నారు. అలా క్రష్ చేసి దానిపైన కాంక్రీట్ వేసి రోడ్డు వేస్తున్నారు. గుడ్డు పెంకలు వేయడం వలన ఏంటి లాభం అనేది చర్చ.
అయితే ఇది బలమైన రోడ్లు లేదా నిర్మాణాల వేసేందుకు ఇది ఒక టెక్నిక్ అని చెబుతున్నారు. దీని వలన చాలా ఎక్కువ రోజులు స్ట్రాంగ్ గా ఉంటుందని.. రోడ్లు డ్యామేజ్ కూడా తొందరగా కావని ఇంజనీర్లు అంటున్నారు. ఇండియాలో అప్పుడే వేసిన రోడ్లు కూడా క్రాక్స్ వస్తుంటాయి.. ఈ ఐడియా ఏదో బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నంత పెద్ద విషయం కాకపోయినప్పటికీ.. ఇది ఒక టెక్నిక్ అని అంటున్నారు. దీనిపై బీజియం యూనివర్సిటీ ఒక రీసెచర్ పబ్లిష్ చేసింది. గుడ్డు పెంకలలో క్యాల్షియం కార్బోనేట్ అధికంగా ఉండటం వలన కాంక్రీట్ బలంగా మారేందుకు తోడ్పడుతుంది.. క్రాక్స్ రాకుండా కాపాడుతుందని స్టడీ వెల్లడించింది. గుడ్డు పెంకలతో రోడ్లు వేయడం అంటే వాటిని రీసైకిల్ చేసి పర్యావరణ కు పాటుపడటం అంటూ సైంటిస్టులు పేర్కొన్నారు.
చైనా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. అలాగే గుడ్లను ఎక్కువగా వినియోగిస్తున్న కంట్రీ. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న గుడ్డు వేస్ట్ వలన ఇబ్బందులు అవుతున్నాయని.. గుండు పెంకులను రీయూజ్ చేయడం వలన కాలుష్యం తగ్గనుందని చెబుతున్నారు.
గ్రీన్ కన్స్ట్రక్షన్:
చైనాలో గుడ్డు పొట్టు కారణంగా పెరుగుతున్న కాలుష్యానికి చెక్ పెట్టాలని అధికారులు భావించారు. అందుకోసం రోడ్డు కాంక్రీట్ లో యూజ్ చేయడం వలన కాలుష్యం తగ్గడమే కాకుండా.. రోడ్లు 30 నుంచి 50 ఏండ్ల వరకు చెక్కు చెదరుకుండా స్థిరంగా ఉంటాయని చెబుతున్నారు. పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనికి గ్రీన్ కన్స్ట్రక్షన్ అంటూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం గమనార్హం.
ఇండియాలో కూడా దీన్ని ఇంప్లిమెట్ చేయాల్సిన అవసరం ఉందని IIT ఢిల్లీ ప్రొఫెసర్ డా.రాజేశ్ కుమార్ తెలిపారు. ఇండియా కూడా ప్రపంచలో అత్యధికంగా గుడ్డు ఉపయోగించే దేశాల జాబితాలో ఉంది. ప్రతి ఏటా రోడ్లలో వాడుకోవడం వలన ఎగ్ వేస్టు తగ్గించడంతో పాటు రోడ్ల మన్నిక కూడా పెరుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.