అస్సాంలో వరదలకు తెగిన రోడ్లు.. వీడియో

అస్సాంలో వరదలకు తెగిన రోడ్లు.. వీడియో

అస్సాం వరదలతో విలవిలలాడిపోతోంది. బ్రహ్మపుత్ర నది పొంగిపొర్లుతోంది. బ్రహ్మపుత్ర నది ప్రవాహం ఇప్పటికే చాలా ఊళ్లను ముంచేసింది. వరద ధాటికి అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. నగావ్ అనే ప్రాంతంలోని ఊళ్లకు మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. రాష్ట్ర రహదారులు వరదల కారణంగా దారుణంగా దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో.. పంటపొలాల మీదుగా వరద ప్రవహం కొనసాగుతోంది. ప్రాణ, ఆస్తినష్టం అంచనావేస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.

అస్సాంలోని  దరంగ్ జిల్లాలనూ పలు ఏరియాలు వరద నీటిలో మునిగిపోయాయి. గ్రామాల్లోకి వచ్చిన వరదనీరు కారణంగా స్థానికులు ఇబ్బందిపడుతున్నారు.