హైదరాబాద్‌లో రాబరీ గ్యాంగ్​ హల్ చల్.. చేజ్​చేసి  పట్టుకున్న స్థానికులు 

హైదరాబాద్‌లో రాబరీ గ్యాంగ్​ హల్ చల్.. చేజ్​చేసి  పట్టుకున్న స్థానికులు 

హైదరాబాద్​:   హైదరాబాద్​లో రాబరీ గ్యాంగ్​ హల్ చల్​ చేశారు.  కార్లను దొంగతనం చేస్తూ..  రోడ్లపై ర్యాష్​ డ్రైవింగ్​ చేస్తూ బీభత్సం సృష్టించారు.  ఈ ఘటన వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ సాగర్ హైవేపై చోటుచేసుకుంది.   గుర్రంగూడ నుంచి ఇంజాపూర్ వైపు ఓ వ్యక్తి కారులో వెళ్తున్నాడు.  ఈ క్రమంలో అక్కడే కాపు కాసిన ఓ రాబరీ గ్యాంగ్ ఆ వ్యక్తిని అడ్డుకుని దాడి చేసి కారుతో అక్కడి నుంచి ఉడాయించారు.  

కాసేపటి తరువాత అదే రహదారిపై  ర్యాష్ డ్రైవింగ్ చూస్తూ రోడ్డు వెంట వెళ్తున్న వారిని ఢీకొట్టుకుంటూ పారిపోయేందుకు యత్నించారు.  గమనించిన స్థానికులు ఓ అంబులెన్స్ లో  వెళ్లి చేజ్ చేసి కారుతో పాటు రాబరీ గ్యాంగ్ లో ఇద్దరిని పట్టుకున్నారు.  నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మిగతా నిందితుల కోసం  పోలీసులు  తీవ్రంగా గాలిస్తున్నారు.