దిలావర్​పూర్​లో రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

దిలావర్​పూర్​లో రేణుక ఎల్లమ్మ ఆలయంలో చోరీ

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మండలం దిలావర్​పూర్​లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. చోరీ వివరాలను ఏఎస్​ఐ శ్రీనివాస్ వర్మ వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు గుడి తాళాలు పగులగొట్టి ఆలయంలో చొరబడి చోరీకి పాల్పడ్డారు. హుండీలో ఉన్న రూ.10 వేల నగదుతో పాటు అమ్మవారి మీద ఉన్న పుస్తెలు, వెండి కిరీటం, ముక్కెరను ఎత్తుకెళ్లారు.

చోరీ సొత్తు విలువ రూ.60 వేలకు పైగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆరేళ్ల శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.