అమ్మవారి గుడిలో హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

V6 Velugu Posted on Nov 26, 2021

నల్లగొండ జిల్లా కనగల్లు మండలం చిన్న మాధారంలో దొంగతనం జరిగింది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో  హుండీ  ఎత్తుకెళ్లారు దొంగలు. ఆలయం గేటు తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. గడిచిన రెండు రోజులుగా ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భక్తులు భారీగా వచ్చారు. అమ్మవారికి కానుకలు సమర్పించారు. ఈ క్రమంలో ఇవాళ హుండీ ఆదాయం లెక్కించాల్సి ఉంది. ఈలోపు హుండీ దొంగతనం జరగడంతో వెంటనే ఆలయ సిబ్బంది, గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆలయంలో ఉన్న సీసీ ఫుటేజ్ లో చోరీకి సంబంధించిన విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీంతో ఆ ఫుటేజ్ ఆధారంగా దొంగల్ని పట్టుకొనే పనిలో పడ్డారు పోలీసులు. 

 

Tagged temple robbery, nalgonda temple theft, renuka yellamma temple, temple theft

Latest Videos

Subscribe Now

More News