అమెరికా రాక్ స్టార్ డేవిడ్ క్రాస్బీ కన్నుమూత

అమెరికా రాక్ స్టార్  డేవిడ్ క్రాస్బీ కన్నుమూత

అమెరికా రాక్ స్టార్ సింగర్ డేవిడ్ క్రాస్బీ(81) కన్నుమూశారు. చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న క్రాస్బీ గురువారం మరణించినట్లు అతని భార్య జాన్ డ్యాన్స్ వెల్లడించారు. క్రాస్బీ లేనప్పటికీ ఆయన  జ్ఞాపకాలు తమకు స్పూర్తినిస్తాయని తెలిపారు.

డేవిడ్ క్రాస్బీ 1941 ఆగస్టు 14న జన్మించారు. డేవిడ్ క్రాస్బీ ఆస్కార్ విన్నర్ పాయిడ్ క్రాస్బీ కుమారుడు. 1960లో అత‌ను రెండు అతిపెద్ద బ్యాండ్ గ్రూపుల‌ను ఏర్పాటు చేశారు. 1964 లో  క్రాస్బీ ద బర్డ్స్  బ్యాండ్ లో  చేరి అమెరికా జానపద కళాకారులతో చాలా ఆల్బమ్స్ చేశారు. రెండు సార్లు రాక్ అండ్ రోల్ హాల్ ఆఫ్ ఫేమర్ లో ఎంట్రీ ఇచ్చారు. ఆరు దశాబ్దాల పాటు రాక్ స్టార్ గా  పేరు ప్రఖ్యాతలు పొందాడు. గిటారిస్ట్, సింగర్ గా పేరుగాంచాడు.