రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ లోటు పూడ్చలేనిది: అగార్కర్‌‌‌‌‌‌‌‌

రోహిత్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ లోటు పూడ్చలేనిది: అగార్కర్‌‌‌‌‌‌‌‌

ముంబై: స్టార్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌‌‌‌‌ కోహ్లీ లేని లోటును పూడ్చటం కష్టమేనని చీఫ్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌ అజిత్‌‌‌‌‌‌‌‌ అగార్కర్‌‌‌‌‌‌‌‌ అంగీకరించాడు. అయితే ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌లో ఈ లోటును భర్తీ చేసేందుకు ఇతర ప్లేయర్లు ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఇద్దరు లెజెండ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఒక్కసారిగా తప్పుకోవడం.. వాళ్ల ప్లేస్‌‌‌‌‌‌‌‌లను భర్తీ చేయడం చాలా కష్టం. కానీ అది ఇతరులకు మంచి అవకాశంగా మేం భావిస్తున్నాం. వాళ్లు వదిలి వెళ్లిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి యంగ్‌‌‌‌‌‌‌‌ క్రికెటర్లు ముందుకు రావాలి’ అని చీఫ్‌‌‌‌‌‌‌‌ సెలెక్టర్‌‌‌‌‌‌‌‌ వెల్లడించాడు. 

టెస్టుల నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ తర్వాత కోహ్లీ తనతో చెప్పాడని అగార్కర్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశాడు. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లేందుకు ఇద్దరు లెజెండ్స్‌‌‌‌‌‌‌‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయా..? లేదా..? అన్నది పక్కనబెడితే.. రాబోయే వరల్డ్‌‌‌‌‌‌‌‌ టెస్ట్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (డబ్ల్యూటీసీ) కోసం కొత్త జట్టును నిర్మించడం చాలా ముఖ్యమన్నాడు. ఇక డాక్టర్లు, ఫిజియోలు చెప్పిన దాని ప్రకారం బుమ్రా ఐదు టెస్ట్‌‌‌‌‌‌‌‌లకు అందుబాటులో ఉంటాడని తాను భావించడం లేదన్నాడు. 

గిల్‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి ఉన్నా..

కొత్త కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌పై అసాధారణ ఒత్తిడి ఉన్నా.. ఇంగ్లండ్‌‌ టూర్‌‌‌‌లో లభించే అనుభవం  మాత్రం అతనికి చాలా ఉపయోగపడుతుందని అగార్కర్‌‌‌‌‌‌‌‌ అన్నాడు. ‘ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ ఎలాగైనా జరగొచ్చు. కానీ అనుభవం మాత్రం పనికొస్తుంది. ప్రస్తుతానికి గిల్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా బాగానే పని చేస్తున్నాడు. అది ఫ్రాంచైజీ క్రికెటైనా ఆ పాత్రను అతను ఆస్వాదిస్తున్నాడు. కాకపోతే ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ లెవెల్లో ఎక్కువ సవాళ్లు ఉంటాయి. ఇద్దరు పెద్ద ఆటగాళ్లు వీడ్కోలు పలికినప్పుడు సహజంగానే జట్టులో పరివర్తన వస్తుంది. వాటిని అధిగమించడానికి కొద్దిగా కష్టపడాలి. 

అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఒత్తిడిని కూడా తట్టుకోవాలి. రాబోయే రోజుల్లో వీటన్నింటిని గిల్‌‌‌‌‌‌‌‌ సమర్థంగా నిర్వర్తిస్తాడని మేం నమ్ముతున్నాం. టీమిండియా టెస్టు జట్టును ముందుకు తీసుకెళ్లే ఏకైక వ్యక్తి గిల్‌‌‌‌‌‌‌‌ అని మేం భావిస్తున్నాం’ అని అగార్కర్‌‌‌‌‌‌‌‌ స్పష్టం చేశాడు. ఒకటి, రెండు సిరీస్‌‌‌‌‌‌‌‌లను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేయలేదని, భవిష్యత్‌‌‌‌‌‌‌‌ను ఊహించి చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చామన్నాడు. గతేడాది గిల్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్సీలో పురోగతి చూశామన్నాడు. కెప్టెన్సీ గిల్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ను కూడా మెరుగుపరుస్తుందన్నాడు. ‘ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌లో అందరికీ పరీక్ష ఎదురవుతుంది. 

ఆస్ట్రేలియాలో ఆడినట్లుగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు సత్తా చాటాల్సిందే. గిల్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌పై మాకు ఎలాంటి అనుమానాల్లేవు. అతను రాణించడానికి కెప్టెన్సీ ప్రేరణగా నిలుస్తుందని మేం భావిస్తున్నాం.  జట్టులో యంగ్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు ఎక్కువగా ఉన్నారు. చీఫ్‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌ గంభీర్‌‌‌‌‌‌‌‌ నుంచి కూడా గిల్‌‌‌‌‌‌‌‌కు మంచి సాయం అందుతుంది. పంత్‌‌‌‌‌‌‌‌ అనుభవం కూడా గిల్‌‌‌‌‌‌‌‌కు అండగా మారుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం’ అని అగార్కర్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చాడు.