
- టీ20 పగ్గాలు రోహిత్‌కే.. రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ
- వెంకటేశ్, అవేశ్, హర్షల్‌కు పిలుపు, సిరాజ్‌కు చాన్స్
- పాండ్యాపై వేటు.. కోహ్లీ, బుమ్రా, షమీ, జడేజాకు రెస్ట్
- కివీస్‌తో టీ20లకు టీమ్ ఎంపిక
ముంబై: ఊహించిందే జరిగింది. విరాట్ కోహ్లీ వారసుడిగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకే ఇండియా టీ20 టీమ్ కెప్టెన్సీ దక్కింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌తో షార్ట్ ఫార్మాట్ ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా రోహిత్.. ఇండియాను నడిపించబోతున్నాడు. ఈ నెల17న మొదలయ్యే ఈ సిరీస్‌కు నేషనల్ సెలక్షన్ కమిటీ మంగళవారం 16 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేసింది. రోహిత్‌కు అఫీషియల్‌గా కెప్టెన్సీ ఇచ్చి సీనియర్ ప్లేయర్ లోకేశ్ రాహుల్‌కు వైస్ కెప్టెన్సీ అప్పగించింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ బౌలర్లు బుమ్రా, షమీ, జడేజాలకు రెస్ట్ ఇచ్చింది. కోహ్లీనే బ్రేక్ కోరగా, టీ20లు ముగిసిన వెంటనే కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రా, షమీకి కూడా రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు ఫామ్ కోల్పోయిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై వేటు వేశారు. సీనియర్ల గైర్హాజరీలో ముగ్గురు కొత్త ప్లేయర్లను టీమ్‌లోకి తీసుకున్నారు. ఐపీఎల్ సెన్సేషనల్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ (కేకేఆర్)తో పాటు 14వ సీజన్‌లో టాప్ వికెట్ టేకర్లు హర్షల్ పటేల్ (ఆర్‌సీబీ), అవేశ్ ఖాన్ (ఢిల్లీ)ను అదృష్టం వరించింది. ఆల్‌రౌండర్ హార్దిక్ ప్లేస్‌ను వెంకటేశ్ అయ్యర్ భర్తీ చేస్తాడని సెలక్టర్లు భావిస్తున్నారు.సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌కు మరోసారి చాన్స్ వచ్చింది. జూన్‌లో శ్రీలంకపై తను రెండు టీ20 ఆడాడు. వరల్డ్‌కప్‌లో ఆకట్టుకోలేకపోయిన స్పిన్నర్ చక్రవర్తి, పేసర్ శార్దూల్ ను సెలక్టర్లు పక్కనబెట్టారు. కానీ, భువనేశ్వర్ కుమార్‌ను తప్పించకుండా ఆశ్చర్యపరిచారు. వరల్డ్‌కప్‌లో రిజర్వ్ ప్లేయర్లుగా ఉన్న శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ ఇప్పుడు మెయిన్ టీమ్‌లోకి తీసుకున్నారు. అదే టైమ్‌లో సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌తో పాటు హైదరాబాదీ మహ్మద్ సిరాజ్‌ను తిరిగి టీ20 టీమ్‌కు ఎంపిక చేశారు. 2017–18లో మూడు టీ20లు ఆడిన సిరాజ్ మూడేళ్ల తర్వాత షార్ట్ ఫార్మాట్ టీమ్‌లోకి తిరిగొచ్చాడు. ఓవరాల్‌గా కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఈ టీమ్ ఈ నెల 17, 19, 21వ తేదీల్లో జైపూర్, రాంచీ, కోల్‌కతా వేదికలుగా కివీస్‌తో మూడు టీ20ల్లో పోటీ పడనుంది. రవిశాస్త్రి ప్లేస్‌లో వచ్చిన రాహుల్ ద్రవిడ్‌కు చీఫ్ కోచ్‌గా ఇదే తొలి సిరీస్ కానుంది. కాగా, ఈ నెల 23 నుంచి జరిగే సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లే ఇండియా–ఎ టీమ్‌నూ సెలక్టర్లు ప్రకటించారు. ప్రియాంక్ పంచల్ కెప్టెన్సీలోని టీమ్‌లో పృథ్వీ షా, పడిక్కల్, రాహుల్ చహర్, ఐపీఎల్ ఫాస్టెస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తదితరులు ఉన్నారు. సఫారీలతో ఈ టీమ్ నాలుగు రోజుల టెస్టులు మూడు ఆడనుంది.
కివీస్‌తో తొలి టెస్టుకూ కోహ్లీ దూరం!
కివీస్‌తో టీ20లతో పాటు టెస్టు సిరీస్‌కు దూరంగా ఉండాలని కోహ్లీ భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని బోర్డుకు తెలిపాడు. అయితే, సెకండ్ టెస్ట్ కల్లా అందుబాటులో ఉండాలని బోర్డు పెద్దలు అతనికి చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కివీస్‌తో తొలి టెస్టులోనూ రోహిత్ జట్టును నడిపించే అవకాశం కనిపిస్తోంది. టెస్టు టీమ్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే ఇంగ్లండ్ సిరీస్‌లో ఫెయిలవడంతో రోహిత్‌కే పగ్గాలు ఇవ్వాలని బోర్డు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండియా టీ20 టీమ్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్, శ్రేయస్, సూర్యకుమార్, పంత్, ఇషాన్, వెంకటేశ్ అయ్యర్, చహల్, అశ్విన్, అక్షర్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్, సిరాజ్.