ముంబై వర్సెస్ సీఎస్‌‌కే: రోహిత్ కొత్త రికార్డును సృష్టిస్తాడా?

ముంబై వర్సెస్ సీఎస్‌‌కే: రోహిత్ కొత్త రికార్డును సృష్టిస్తాడా?

క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించడానికి పొట్టి ఫార్మాట్ రెడీ అవుతోంది. ఐపీఎల్ ఫేజ్‌ 2 రూపంలో ధనాధన్ క్రికెట్‌తో పలు వారాల పాటు తిరుగులేని వినోదం అందనుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు మధ్య జరిగే మ్యాచ్‌తో ఫేజ్ 2కు తెరలేవనుంది. ప్లేఆఫ్స్‌లో ప్లేస్ కోసం ప్రతి మ్యాచ్ ముఖ్యమే కాబట్టి గెలిచేందుకు ఇరు టీమ్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో అరుదైన రికార్డును అందుకోవడానికి ముంబై సారథి రోహిత్ శర్మ ఉవ్విళ్లూరుతున్నాడు. 

టీ20 క్రికెట్‌లో ఇప్పటివరకు 397 సిక్సర్లు బాదిన హిట్‌మ్యాన్..  400 సిక్సర్ల రికార్డుపై కన్నేశాడు. మరో మూడు సిక్సర్లు కొడితే అరుదైన రికార్డును సృష్టించినట్లు అవుతుంది. ఐపీఎల్‌లో రోహిత్ 224 సిక్సర్లు బాదాడు. వీటిలో ముంబై ఇండియన్స్ తరఫున 173 సిక్సర్లు కొట్టాడు. మిగిలినవి టోర్నీ ఆరంభ సీజన్లలో ప్రాతినిధ్యం వహించిన డెక్కన్ చార్జర్స్ తరఫున బాదాడు. ఇకపోతే, రోహిత్ తర్వాత పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్లుగా సురేష్ రైనా (315 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (303 సిక్సర్లు) ఉన్నారు.